విధాత‌: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోనియాగాంధీ అపాయింట్‌మెంట్‌ కోరారు. రాష్ట్రంలో జరిగే పరిణామాలపై ఆమెకు వివరించనున్నారు. మర్రి శశిధర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడిన తర్వాత వెంకట్‌రెడ్డి సోనియాతో భేటీ అయి రాష్ట్రంలో పార్టీ పరిస్థితి గురించి వివరిస్తానని అంటున్నారు. అయితే ఆమె అపాయింట్‌మెంట్‌ ఇస్తారా? ఒకవేళ ఇస్తే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏం చేప్తారు? అనే చర్చ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నది. తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడటం, బీజేపీలో చేరడం, మునుగోడు ఉప ఎన్నికల్లో […]

విధాత‌: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోనియాగాంధీ అపాయింట్‌మెంట్‌ కోరారు. రాష్ట్రంలో జరిగే పరిణామాలపై ఆమెకు వివరించనున్నారు. మర్రి శశిధర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడిన తర్వాత వెంకట్‌రెడ్డి సోనియాతో భేటీ అయి రాష్ట్రంలో పార్టీ పరిస్థితి గురించి వివరిస్తానని అంటున్నారు. అయితే ఆమె అపాయింట్‌మెంట్‌ ఇస్తారా? ఒకవేళ ఇస్తే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏం చేప్తారు? అనే చర్చ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నది.

తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడటం, బీజేపీలో చేరడం, మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిపోవడం వంటివి బీజేపీకే కాదు, వెంకట్‌రెడ్డికి కూడా షాకిచ్చిందద‌ని ప‌లువురు అంటున్నారు. ఎందుకంటే వెంకట్‌రెడ్డి బహిరంగంగానే తన సోదరుడి గెలుపు కోసం తన వంతు ప్రయత్నం చేశాడు. అయితే రాష్ట్ర నాయకత్వ వైఖరి వల్లనే రాజగోపాల్‌రెడ్డి ఓడిపోయారని అనుకుంటున్నారు.

మునుగోడులో వెంకట్‌రెడ్డి తన తమ్ముడి గెలుపు కోసం పనిచేయాలని మాట్లాడిన ఆడియోపై వివరణ ఇవ్వాలని ఇప్పటికే ఆయనకు పార్టీ అధిష్ఠానం నోటీసు ఇచ్చింది. ఆయన ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని, ఆయనపై చర్యలు ఉంటాయని మీడియాలో వార్తలు వచ్చాయి.

వెంకట్‌రెడ్డి కూడా రాజీనామా చేసి బీజేపీలో చేరుతారని, రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక రానున్నదని కొంతకాలంగా బీజేపీ నేత‌లు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంక‌ట్‌రెడ్డి సోనియాగాంధీ అపాయింట్‌ మెంట్‌ కోరడం ఆసక్తికరంగా మారింది. నిజంగా ఆయన పార్టీని వీడుతారా? లేక రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో ప్రక్షాళన కోరుతారా? అన్నది తేలుతుంది.

Updated On 23 Nov 2022 8:32 AM GMT
krs

krs

Next Story