విధాత, మెదక్ బ్యూరో: చెలిమే తండా గ్రామస్తులకు రుణపడి ఉంటానని సినీ నటుడు సోనూసూద్ అన్నారు సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని దుబ్బ తండా గ్రామపంచాయతీ శివారు చెలిమే తండాలో సోను సూద్ విగ్రహంతో ఏర్పాటు చేసి గుడి కట్టడంతో ఆ గ్రామాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సంద‌ర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ తనపై ప్రేమతో తన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన చెలిమి తండా గ్రామ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఆయన అన్నారు. గ్రామ ప్రజలు […]

విధాత, మెదక్ బ్యూరో: చెలిమే తండా గ్రామస్తులకు రుణపడి ఉంటానని సినీ నటుడు సోనూసూద్ అన్నారు సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని దుబ్బ తండా గ్రామపంచాయతీ శివారు చెలిమే తండాలో సోను సూద్ విగ్రహంతో ఏర్పాటు చేసి గుడి కట్టడంతో ఆ గ్రామాన్ని బుధవారం ఆయన సందర్శించారు.

ఈ సంద‌ర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ తనపై ప్రేమతో తన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన చెలిమి తండా గ్రామ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఆయన అన్నారు. గ్రామ ప్రజలు చూపించిన ప్రేమ నా జీవితంలో ఎప్పటికీ మరువలేనని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో మద్దూరు జెడ్పిటిసి గిరి కొండల్ రెడ్డి, గొర్రెల మేకల పెంపక దార్ల సొసైటీ సంఘం డైరెక్టర్ ఆలేటి యాదగిరి సర్పంచ్ సుజాత శ్రీనివాస్, ఎంపీటీసీ నంకు, బైరాన్ పల్లి సర్పంచ్ బండి శ్రీనివాస్ గౌడ్ , తండావాసులు తదితరులు పాల్గొన్నారు.

Updated On 18 Jan 2023 3:59 PM GMT
krs

krs

Next Story