విధాత: రాష్ట్రంలో త్వరలో గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రం ఫిజికల్‌ టెస్ట్‌ శిక్షణ పొందుతున్న ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగార్థులకు మంత్రి పాలు, పండ్లు పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 17 పోలీసులు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని, త్వరలో మరో 2 వేల పోలీసు ఉద్యోగాలు ఇస్తామని మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్‌ పేరుతో నిరుద్యోగులను నిండా ముంచిందని విమర్శించారు. యువత జీవితాలు నాశనం చేసేలా […]

విధాత: రాష్ట్రంలో త్వరలో గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రం ఫిజికల్‌ టెస్ట్‌ శిక్షణ పొందుతున్న ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగార్థులకు మంత్రి పాలు, పండ్లు పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 17 పోలీసులు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని, త్వరలో మరో 2 వేల పోలీసు ఉద్యోగాలు ఇస్తామని మంత్రి చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్‌ పేరుతో నిరుద్యోగులను నిండా ముంచిందని విమర్శించారు. యువత జీవితాలు నాశనం చేసేలా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయి. నాలుగేళ్ల కాలంలో ఉద్యోగాలు చేపట్టడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. ఉద్యోగం తర్వాత భద్రత కోసం ఫించన్‌ పథకం చేపట్టామన్నారు. గ్రూప్‌-4 ఉద్యోగాల్లో స్థానికులకే 95 శాతం వస్తాయని మంత్రి వెల్లడించారు.

Updated On 13 Nov 2022 6:18 AM GMT
krs

krs

Next Story