విధాత: ఇకపై ఎక్కడ ఏ వస్తువు కొనుక్కున్నా బిల్ జనరేట్ చేయడానికి వినియోగదారులు సెల్‌ఫోన్ నెంబర్ (Mobile Number) తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం లేదని వినియోగదారుల మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ మేరకు త్వరలోనే స్పష్టమైన మార్గదర్శకాలతో ఆదేశాలు జారీ చేయనుంది.
అయితే.. తాము ఫోన్ నెంబర్ ఇవ్వలేమని చెబుతుంటే.. అలా అయితే బిల్ జనరేట్ చేయలేమని స్టోర్లు, షాపింగ్ మాల్స్ తదితర రిటైలర్లు చెబుతున్నారని వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి.
వ్యాపారులు ఫోన్ నెంబర్ తప్పనిసరి అనడం వినియోగదారుల పరిరక్షణ చట్టం ఉల్లంఘనేనని ఆ శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ తెలిపారు.
ఒక వేళ నంబరు తప్పనిసరి అనిపిస్తే వ్యాపారులు కస్టమర్ అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. మార్గదర్శకాలు వచ్చాక మరింత అవగాహన కల్పిస్తామని తెలిపారు.