Sore Throat | చలికాలంలో జలుబు, దగ్గు తదితర ఆరోగ్య సమస్యలు సర్వసాధారణం. దాంతోపాటు గొంతు నొప్పి సమస్యలు ఉంటాయి. చాలా మంది గొంతునొప్పిని చాలా తేలిగ్గా తీసుకుంటారు. అలా చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. వాస్తవానికి జలుబు, ఫ్లూ కాకుండా అనేక కారణాల వల్ల గొంతు నొప్పి సమస్యలు కారణం కావొచ్చు. గొంతు నొప్పికి కారణాలేంటో తెలుసుకుందాం రండి.. కరోనా వైరస్ కరోనా ప్రధాన లక్షణాలలో గొంతు నొప్పి ఒకటి. వైరస్ శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం […]

Sore Throat | చలికాలంలో జలుబు, దగ్గు తదితర ఆరోగ్య సమస్యలు సర్వసాధారణం. దాంతోపాటు గొంతు నొప్పి సమస్యలు ఉంటాయి. చాలా మంది గొంతునొప్పిని చాలా తేలిగ్గా తీసుకుంటారు. అలా చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. వాస్తవానికి జలుబు, ఫ్లూ కాకుండా అనేక కారణాల వల్ల గొంతు నొప్పి సమస్యలు కారణం కావొచ్చు. గొంతు నొప్పికి కారణాలేంటో తెలుసుకుందాం రండి..

కరోనా వైరస్
కరోనా ప్రధాన లక్షణాలలో గొంతు నొప్పి ఒకటి. వైరస్ శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. దాంతో జ్వరంతో పాటు జలుబు, జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే గొంతునొప్పిగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఎయిర్‌ పొల్యూషన్‌
ప్రస్తుతం కలుషిత పీల్చడం కష్టంగా మారింది. వాయు కాలుష్యం ఊపిరితిత్తులను బలహీనపరుస్తోంది. కాలుష్యం కారణంగా ముక్కు, నోరు, గొంతులో చికాకుగా ఉంటుంది. ఉదయం తరచుగా గొంతు నొప్పి ఉంటే.. కలుషితమైన గాలిని పీల్చుకోకుండా.. స్వచ్ఛమైన గాలి ప్రాంతాల్లో ఉండాలి. శీతాకాలం పొడి గాలి సైతం గొంతు నొప్పికి కారణమవుతుంది.

డీహైడ్రేషన్‌తో..
చలికాలంలో తక్కువ నీరు తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్‌కు గురవుతుంది. బాడీలో నీటి కొరత కారణంగా గొంతు పొడిగా మారుతుంది. దాంతో పుండ్లు పడే ప్రమాదం ఉంటుంది. మంట, గొంతు నొప్పిని నివారించేందుకు అవసరమైన మేర నీరు తాగుతూ ఉండాలి.

అలర్జీలు
అలర్జీ సాధారణ లక్షణాలు జలుబు, దగ్గు, గొంతు నొప్పి. తెల్లవారుజామున దుమ్ము అలర్జీని కలిగిస్తుంది. దాంతో గొంతు సమస్యతో బాధపడాల్సి వస్తుంది. పెర్ఫ్యూమ్, ఫ్లవర్ పుప్పొడి, పెంపుడు జంతువులతో కలిగే అలర్జీ కూడా గొంతు నొప్పికి కారణమవుతాయి.

గొంతునొప్పి నివారణకు చిట్కాలు..
ఎప్పుడైనా గొంతు వద్ద నొప్పిగా అనిపించిన సందర్భంలో ఉప్పు నీటితో పుక్కిలించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అలాగే తీనెను తీసుకున్న సమస్య తొలగుతుంది. అల్లం టీ, డికాషన్ సైతం గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

Updated On 4 Jan 2023 4:33 AM GMT
Vineela

Vineela

Next Story