Anicka Vikramman | నటి తీవ్రగాయాలతో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, ప్రేమికుడి నిర్వాకమే ఈ గాయాలకు కారణమంటూ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. ఆ నటి ఎవరో కాదు కోలీవుడ్‌కు చెందిన అనికా విజయ్ విక్రమన్. ముఖంపై గాయాలు, ఉబ్బిన కళ్లు, గాయాలకు సంబంధించిన ఫొటోలను చూసిన ఆమె అభిమానులు ఆందోళనకు గురయ్యారు. నటి అనూప్ పిళ్లై అనే వ్యక్తితో డేటింగ్ చేస్తున్నది. సదరు వ్యక్తి ఇలా దాడి చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని, అప్పుడు కాళ్లు పట్టుకుంటే వదిలేశానని, తాజాగా మరోసారి దాడి చేశాడంటూ చెప్పుకొచ్చింది.
నటి ఇన్‌స్టా పోస్ట్‌లో తన బాధను ఏకరువు పెట్టింది. ‘గతంలో నాకు ఏమి జరిగిందో వదిలిపెట్టినప్పటికీ, నాకు నిరంతరం బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నా కుటుంబంపై నిరంతరం బురద జల్లుతున్నారు. దురదృష్టవశాత్తు నేను అనూప్ పిళ్లై అనే వ్యక్తితో డేటింగ్ చేస్తున్నాను. కానీ, అతను నన్ను మానసికంగా, శారీరకంగా హింసించాడు. అతనిలాంటి మనిషిని నేనెప్పుడూ చూడలేదు. ఇంత జరిగినా కూడా నన్ను బెదిరిస్తున్నాడు. అతను ఇలా చేస్తాడని కలలో కూడా అనుకోలేదు. అతను నాపై చెన్నైలో తొలిసారిగా దాడి చేశాడు. తర్వాత నా కాళ్ల మీద పడి ఏడవడం మొదలుపెట్టాడు.
అతన్ని క్షమించడానికి నేను మూర్ఖురాలిని. బెంగుళూరులో ఉన్నప్పుడు రెండోసారి దాడికి పాల్పడ్డాడు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాను. అతను పోలీసులకు డబ్బులను ఎరగా వేశాడు. ఈ విషయాన్ని ఇద్దరూ పరిష్కరించుకోవాలని సూచించారు. దాంతో అతనికి మళ్లీ నాపై దాడి చేసే ధైర్యం వచ్చింది. నేను దెబ్బలు భరించలేక ఏడుస్తుంటే డ్రామా బాగా చేస్తున్నావ్ అంటూ హేళన చేస్తు నవ్వేవాడు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మరో వారం వరకు నేను ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించను’ అంటూ గాయాలకు సంబంధించిన ఫొటోలను నటి పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాను మరో వారం వరకు ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించను అంటూ గాయాలకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
View this post on Instagram