విధాత: సిరీస్ నిర్ణయాత్మక ఢిల్లీ వన్డేలో టీమిండియా దక్షిణాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా జట్టు టీమిండియా బౌలర్ల విజృంభణతో 27.1 ఓవర్లకే 99 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్-4 వికెట్లు, షాబాజ్ అహ్మద్-2, సిరాజ్-2, వాషింగ్టన్ సుందర్-2 వికెట్లు తీశారు. అనంతరం 100 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. దీంతో మూడు […]

విధాత: సిరీస్ నిర్ణయాత్మక ఢిల్లీ వన్డేలో టీమిండియా దక్షిణాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా జట్టు టీమిండియా బౌలర్ల విజృంభణతో 27.1 ఓవర్లకే 99 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్-4 వికెట్లు, షాబాజ్ అహ్మద్-2, సిరాజ్-2, వాషింగ్టన్ సుందర్-2 వికెట్లు తీశారు. అనంతరం 100 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకున్నది.
