SCR | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణిలకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక రైళ్లను మరికొద్ది రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రైళ్లను కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. మచిలీపట్నం - సికింద్రాబాద్‌ (07185) రైలు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్నం 3.15 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి రాత్రి 11 గంటలకు సికింద్రాబాద్‌ స్టేషన్‌కు చేరుకోనున్నది. సికింద్రాబాద్‌ - మచిలీపట్నం (07186) ప్రతి రైలు ఆదివారం అందుబాటులో ఉంటుంది. రాత్రి 11.55 గంటకలు […]

SCR |

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణిలకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక రైళ్లను మరికొద్ది రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రైళ్లను కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. మచిలీపట్నం - సికింద్రాబాద్‌ (07185) రైలు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్నం 3.15 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి రాత్రి 11 గంటలకు సికింద్రాబాద్‌ స్టేషన్‌కు చేరుకోనున్నది.

సికింద్రాబాద్‌ - మచిలీపట్నం (07186) ప్రతి రైలు ఆదివారం అందుబాటులో ఉంటుంది. రాత్రి 11.55 గంటకలు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు మచిలీపట్నం చేరుతుంది. రైలును సెప్టెంబర్‌ 3 నుంచి అక్టోబర్‌ ఒకటో తేదీ వరకు పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. రెండు మార్గాల్లో కాజీపేట, వరంగల్‌, డోర్నకల్‌, ఖమ్మం, విజయవాడ, గుడివాడ స్టేషన్లలో ఆగుతుందని చెప్పింది.

తిరుపతి - సికింద్రాబాద్‌ (07481) ప్రత్యేక రైలును ఈ నెల 3 నుంచి అక్టోబర్‌ ఒకటి వరకు పొడిగించి.. ప్రతి ఆదివారం అందుబాటులో ఉండనున్నది. రాత్రి 7.50 గంటలకు తిరుపతిలో బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంటుంది.

సికింద్రాబాద్ నుంచి తిరుపతి (07482) ప్రతి సోమవారం అందుబాటులో ఉండనుండగా.. రైలును 4వ తేదీ నుంచి అక్టోబర్‌ 2వ తేదీ వరకు పొడిగించింది. సాయంత్రం సికింద్రాబాద్‌లో 5.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు తిరుపతికి చేరుతుంది.

రైలు జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుందని పేర్కొంది. ఆయా రైళ్లను ప్రయాణికులు వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది.

Updated On 1 Sep 2023 10:57 AM GMT
cm

cm

Next Story