SpinOk Spyware | ప్ర‌స్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగింది. ప్ర‌తి ఒక్క‌రి చేతిలో క‌నిపిస్తున్న‌ది. ఎవ‌రికి వారు త‌మ‌కు న‌చ్చిన యాప్స్‌ను ప్లే స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. అయితే ఎదిప‌డితే ఆ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవ‌డం వ‌ల్ల ప్ర‌మాదంలో ప‌డే అవ‌కాశాలు లేక‌పోలేదు. ఈ ప‌రిస్థితుల్లో గూగుల్ ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తంగా ఉంటూ యాప్స్‌ను ప్లే స్టోర్ నుంచి తొల‌గిస్తూ ఉంటుంది. ఈ క్ర‌మంలోనే గూగుల్ త‌న స్టోర్ నుంచి వంద‌కు పైగా యాప్స్‌ను తొల‌గించింది. […]

SpinOk Spyware | ప్ర‌స్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగింది. ప్ర‌తి ఒక్క‌రి చేతిలో క‌నిపిస్తున్న‌ది. ఎవ‌రికి వారు త‌మ‌కు న‌చ్చిన యాప్స్‌ను ప్లే స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. అయితే ఎదిప‌డితే ఆ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవ‌డం వ‌ల్ల ప్ర‌మాదంలో ప‌డే అవ‌కాశాలు లేక‌పోలేదు. ఈ ప‌రిస్థితుల్లో గూగుల్ ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తంగా ఉంటూ యాప్స్‌ను ప్లే స్టోర్ నుంచి తొల‌గిస్తూ ఉంటుంది.

ఈ క్ర‌మంలోనే గూగుల్ త‌న స్టోర్ నుంచి వంద‌కు పైగా యాప్స్‌ను తొల‌గించింది. ఈ యాప్స్‌లో ప్ర‌మాద‌క‌ర‌మైన మాల్వేర్‌ను గుర్తించింది. ఈ మాల్వేర్ పేరు SpinOk స్పైవేర్ తేలింది. దిగ్ర్భాంతిక‌ర‌మైన విష‌యం ఏంటంటే ఈ యాప్స్ 400 మిలియ‌న్ల‌కుపైగా ఫోన్ల‌లో డౌన్‌లోడ్ అయ్యాయి.

మాల్వేర్ స‌హాయంతో హ్యాక‌ర్లు వ్య‌క్తుల‌కు సంబంధించిన డేటాతో పాటు సొత్తును లూటీ చేసే అవ‌కాశాలున్నాయ‌ని నిపుణులు పేర్కొంటున్నారు. డాక్ట‌ర్ వెబ్‌లోని భ‌ద్ర‌తా ప‌రిశోధ‌కులు Bleeping Computer సహకారంతో గూగుల్ ప్లే స్టోర్‌లోని వంద‌కు పైగా యాప్స్‌కు స్పిన్ఒకే (SpinOK) అనే కొత్త స్పైవేర్‌ను ఇటీవల గుర్తించారు.

ఈ ట్రోజ‌న్ మాల్వేర్ స్మార్ట్ ఫోన్ యూజ‌ర్స్‌ను ఆక‌ర్షించేందుకు రోజువారీ రివార్డుల‌తో కూడిన మినీగేమ్‌ల‌ను చూపిస్తుంద‌ని, చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన‌విగా క‌నిపిస్తాయ‌ని ప‌రిశోధ‌కులు పేర్కొంటున్నారు. వాటిని డౌన్‌లోడ్ చేసిన త‌ర్వాత మాల్వేర్ డివైజ్‌ల‌లోని స్టోర్ చేసిన ప్రైవేటు డేటాను దొంగిలించి రిమోట్ స‌ర్వ‌ర్‌కు పంపుతుంద‌ని డాక్టర్ వెబ్ నివేదిక వెల్లడించింది. ఈ క్ర‌మంలో ఎవ‌రైనా ఈ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఉంటే వెంట‌నే అన్ ఇన్‌స్టాల్ చేయాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Updated On 3 Jun 2023 4:35 PM GMT
Vineela

Vineela

Next Story