NTR | ఆంధ్రాలో వెలిసిన పోస్టర్లు , ఫ్లెక్సీలు విధాత‌: ఆంధ్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ధన్యవాదాలు తెలిపారు. తమ కుటుంబాన్ని వాడుకుని చివరకు తమను అత్యంత అవమానకరంగా తన్ని తరిమేసిన అల్లుడు చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో వేసిన జగన్ కు పెద్ద ఎన్టీయార్ ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా కృష్ణ జిల్లాలో భారీగా ఫ్లెక్సీలు వెలిసాయి. చంద్రబాబును ఆదివారం రాత్రి జైలుకు తరలించిన తరువాత రాత్రికిరాత్రి ఈ […]

NTR |

ఆంధ్రాలో వెలిసిన పోస్టర్లు , ఫ్లెక్సీలు

విధాత‌: ఆంధ్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ధన్యవాదాలు తెలిపారు. తమ కుటుంబాన్ని వాడుకుని చివరకు తమను అత్యంత అవమానకరంగా తన్ని తరిమేసిన అల్లుడు చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో వేసిన జగన్ కు పెద్ద ఎన్టీయార్ ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా కృష్ణ జిల్లాలో భారీగా ఫ్లెక్సీలు వెలిసాయి. చంద్రబాబును ఆదివారం రాత్రి జైలుకు తరలించిన తరువాత రాత్రికిరాత్రి ఈ ఫ్లెక్సీలు వెలిసాయి.

దీంతో ఇవి ఎవరు ఏర్పాటు చేసారు ? అంటూ జనం ఆసక్తిగా గమనిస్తున్నారు. వాస్తవానికి ఎన్టీరామారావు దగ్గర నుంచి పార్టీని స్వాధీనం చేసుకున్న ఘటన, ఆ తరువాత ఆయన్ను సీఎం నుంచి పదవీచ్యుతుడ్ని చేసి ఎలా అవమానించిందీ చాలామందికి గుర్తు ఉంటుంది. అంతేకాకుండా హరికృష్ణను సైతం రాజకీయంగా ఎలా వాడుకుని తరువాత పక్కనబెట్టింది కూడా తెలిసిందే. ఇప్పుడు ఈ అంశాలన్నీ ఆ ఫ్లెక్సీలో పేర్కొన్నారు.

అంతేకాకుండా లోకేష్ పాదయాత్రలో పాల్గొని తారకరత్న ప్రాణాలు విడిచిన అంశాన్ని కూడా ఆ ఫ్లెక్సీలో రాసారు. అంటే అన్ని అవసరాలకూ నందమూరి కుటుంబాన్ని వాడుకుని అవసరం తీరిపోయాక తన్ని తరిమేస్తున్న చంద్రబాబును తమ కుటుంబీకులు ఎవరూ ఏమీ చేయలేకపోయినా జగన్ మాత్రం జైలుకు పంపారని, ఇది తనకు ఎంతో సంతోషం కలిగిస్తుందని పెద్ద ఎన్టీయార్ చెబుతున్నట్లుగా ఆ ఫ్లెక్సీలో రాశారు.

ఇది ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో సర్కులేట్ అవుతున్నది. నందమూరి అభిమానులు ఈ పోస్టర్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పుడు ఎన్టీయార్ ఆత్మకు శాంతి చేకూరింది అంటూ లక్ష్మీపార్వతి హైదరాబాద్ లో ఎన్టీయార్ గార్డెన్లో అయన సమాధిని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. తన మనసు ఇప్పటికి కుదుటపడిందని .. ఎన్టీయార్ ను వంచించినవాళ్లకు తగిన శాస్తి జరిగిందని ఆమె నిన్ననే సంతోషం వ్యక్తం చేశారు.

Updated On 11 Sep 2023 10:52 AM GMT
somu

somu

Next Story