SCR |
దక్షిణ మధ్య రైల్వే మూడు రోజుల పాటు పలు మార్గాల్లో నడిచే పలు ట్రైన్స్‌ను పాక్షికంగా, మరికొన్నింటిని పూర్తిగా రద్దు చేసింది. ఇంటర్ లింకింగ్ పనుల కారణంగా ఈ నెల 6, 8, 9 తేదీల్లో ఆయా ట్రైన్స్ రద్దు చేయడంతో పాటు మార్పులు చేసినట్లు పేర్కొంది.
ఈ నెల 6, 8 తేదీల్లో కాచిగూడ-విశాఖపట్నం రైలు (Train No-862)ను రద్దు చేసింది. మే 8న సికింద్రాబాద్-రాయ్‌పూర్ (Train No-12771), రాయ్‌పూర్-సికింద్రాబాద్ (Train No-12772), దర్భంగా-సికింద్రాబాద్ (Train No-17008) డివిజన్‌ల మధ్య రైళ్లు పాక్షికంగా దక్షిణ మధ్య రైల్వే పాక్షికంగా రద్దు చేసింది.
IRCTC Rules | మీరు రైలులో ప్రయాణిస్తుంటారా..? నిబంధనలు మారాయి అవేంటో తెలుసుకోండి మరి..!
రైల్వే ప్రయాణికులు షెడ్యూల్‌లో మార్పును గమనించి, అందుకు అనుగుణంగా తమ ప్రయాణాల్లో మార్పులు చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది. ఇక వేసవి కారణంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది. విజయవాడ మీదుగా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు పేర్కొంది.
03226 రైలు సికింద్రాబాద్-దానాపూర్ రూట్‌లో మే 7 నుంచి జూలై 2 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి ఆదివారం ఉదయం 10.00 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 7 గంటలకు దానాపూర్‌కు చేరుతుంది.
Indian Railway | జనరల్ టికెట్‌తో స్లీపర్ కోచ్‌లో ప్రయాణం చేయవచ్చా..? చేస్తే ఎమవుతుందో తెలుసా..?
రైలు నంబర్ 07189 రైలు నాందేడ్-ఈరోడ్ మార్గంలో జూన్ 30వ తేదీవరకు ప్రత్యేక రైలు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2.20 గంటలకు నాందేడ్ బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఈ-రోడ్ చేరనున్నది.
08585/08586 రైలు విశాఖపట్నం-మహబూబ్‌నగర్ మధ్య ప్రతి మంగళవారం జూన్ 28వ తేదీ వరకు నుడనున్నది. విశాఖపట్నంలో ప్రతి మంగళవారం సాయంత్రం 5.35 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 10.30 గంటలకు మహబూబ్‌నగర్ చేరనున్నది.
తిరుగు ప్రయాణంలో ఇదే రైలు మహబూబ్‌నగర్‌లో సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.50 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. 08543/08544 రైలు విశాఖపట్నం-బెంగళూరు ఈ నెల 7వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అందుబాటులో ఉండనుండగా.. విశాఖపట్నంలో మధ్యాహ్నం 3.55 గంటలకు బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరు చేరనున్నది.