SREE LEELA ప్రస్తుతానికి టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది పూజా హెగ్డే, రష్మిక మందన్నా వంటి వారు. వారు తమ చిత్రాలకు నాలుగైదు కోట్లు డిమాండ్ చేసి తీసుకుంటున్నారు. ఫేడ్ అవుట్ అయిన శృతిహాసన్ కూడా వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి చిత్రాలకు కలిపి ప్యాకేజీగా ఐదారు కోట్ల వరకు వసూలు చేసిందని వార్తలు వస్తున్నాయి. కానీ వీరి హవా ఎంతో కాలం కొనసాగేలా కనిపించడం లేదు. వీరికి పోటీగా శ్రీలీల బరిలోకి […]

SREE LEELA

ప్రస్తుతానికి టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది పూజా హెగ్డే, రష్మిక మందన్నా వంటి వారు. వారు తమ చిత్రాలకు నాలుగైదు కోట్లు డిమాండ్ చేసి తీసుకుంటున్నారు. ఫేడ్ అవుట్ అయిన శృతిహాసన్ కూడా వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి చిత్రాలకు కలిపి ప్యాకేజీగా ఐదారు కోట్ల వరకు వసూలు చేసిందని వార్తలు వస్తున్నాయి.

కానీ వీరి హవా ఎంతో కాలం కొనసాగేలా కనిపించడం లేదు. వీరికి పోటీగా శ్రీలీల బరిలోకి దిగింది. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన పెళ్లి సందడి చిత్రంతో ఈమె హీరోయిన్‌గా పరిచయమైంది. తన ఎనర్జీ లెవెల్స్, అందం, టాలెంట్‌తో పాటు అదృష్టం కూడా ఈమెకు కలిసి వచ్చింది. అలా ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ స్టేటస్‌ని దక్కించుకున్న అతి తక్కువ మంది హీరోయిన్లలో శ్రీలీల ఒకరు.

సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. ఈ కన్నడ, తెలుగు మిక్స్‌డ్‌ బ్యూటీ తొలి సినిమాతోనే తన మెరుపుతీగ లాంటి డ్యాన్స్, అందంతో పాటు అద్భుతమైన నటనను కనబరిచింది. యూత్ క్లాస్ మాస్ ఫ్యామిలీ ఆడియన్స్ ఇలా ఒకరేమిటి అందర్నీ తనకు ఫ్యాన్‌గా చేసుకోంది. ఈమె కోస‌మే సినిమాలకు వెళ్లే ఆడియన్స్ సంఖ్య లక్ష‌ల్లో పెరిగిపోయింది. అందుకు ఉదాహరణ ఇటీవల విడుదలైన ‘ధమాకా’ చిత్రం. మొదటి చిత్రంలో యంగ్ హీరో సరసన‌ నటించిన శ్రీ‌లీల.. రెండో చిత్రంలో కాస్త సీనియర్ అయిన రవితేజ స‌ర‌స‌న న‌టించ‌డంపై కామెంట్లు వచ్చాయి.

కానీ అవేమి పట్టించుకోకుండా శ్రీలీల ఆ చిత్రంలో నటించింది. ఇందులో ఆమె వేసిన మాస్ డాన్స్, అద్భుతమైన యాక్టింగ్ ఈ చిత్రాన్ని మరో లెవల్‌కు తీసుకువెళ్లాయి. డాన్స్, స్టెప్స్‌కి థియేటర్స్ ఊగిపోయాయి. శ్రీ‌లీలకు ఉన్న క్రేజ్‌ను అర్థం చేసుకున్న దర్శక నిర్మాతలు ఆమెను తమ సినిమాలలో హీరోయిన్‌గా పెట్టుకునేందుకు క్యూ కట్టేస్తున్నారు. ఇప్పటికే ఆమె మహేష్ త్రివిక్రమ్‌ల SSMB 28 చిత్రంలో పూజా హెగ్డే‌తో కలిసి నటిస్తోంది. బాలయ్య చిత్రంలో కూడా ఓ కీలక పాత్రని చేస్తోంది. దీని తరువాత కూడా క్రేజీ ఆఫర్స్‌ని తన ఖాతాలో వేసుకుంటుంది.

శ్రీలీల మేనియా చూసినా ఇతర స్టార్ హీరోయిన్స్ ఇక లాభం లేద‌ని త‌మ రెమ్యూన‌రేష‌న్‌ని బాగా తగ్గించుకుంటున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. నిజంగా ఇది నిజమైతే మాత్రం శ్రీలీల క్రేజ్‌కి ఇదని గర్వంగా చెప్పుకోవచ్చు. శ్రీలీల కేవలం కోటి రూపాయలకే నిర్మాతలకు డేట్స్ ఇస్తోంది.

ఇలా అతి తక్కువ ధరకు అద్భుతమైన ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ అందుబాటులో ఉండడంతో నిర్మాతలందరూ ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నారు. ఇలాంటి సమయంలో రెమ్యూనరేషన్ విషయంలో కాస్త బెట్టు చేస్తే మొదటికే మోసం వస్తుందని అర్థం చేసుకున్న స్టార్ హీరోయిన్స్ సగానికి సగం త‌మ రెమ్యూన‌రేష‌న్‌ని కుదించుకుంటున్నారట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Updated On 25 Jan 2023 3:21 PM GMT
krs

krs

Next Story