కాస్టింగ్ కౌచ్‌పై సంచ‌ల‌న కామెంట్స్‌ విధాత‌: తెలుగువారికి శ్రీముఖి చాలా బాగా పరిచయం. చూడటానికి మన పక్కింటి అమ్మాయిలా ఉండే ఈమె టీవీ వ్యాఖ్యాతగా బాగా అలరిస్తుంది. అంతేకాదు ఈమె నటిగా కూడా ప‌రిచ‌య‌మే. అదుర్స్ అనే కార్యక్రమంతో వ్యాఖ్యాతగా ప్రవేశించి అల్లు అర్జున్- త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘జులాయి’ సినిమాతో వెండితెరకు ప్రవేశించింది. ఇక ఈమె ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో హీరోయిన్‌గా కూడా చేసింది. నిజామాబాద్‌కి చెందిన శ్రీముఖి.. టీవీ వ్యాఖ్యాతగా అవకాశం […]

కాస్టింగ్ కౌచ్‌పై సంచ‌ల‌న కామెంట్స్‌

విధాత‌: తెలుగువారికి శ్రీముఖి చాలా బాగా పరిచయం. చూడటానికి మన పక్కింటి అమ్మాయిలా ఉండే ఈమె టీవీ వ్యాఖ్యాతగా బాగా అలరిస్తుంది. అంతేకాదు ఈమె నటిగా కూడా ప‌రిచ‌య‌మే. అదుర్స్ అనే కార్యక్రమంతో వ్యాఖ్యాతగా ప్రవేశించి అల్లు అర్జున్- త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘జులాయి’ సినిమాతో వెండితెరకు ప్రవేశించింది.

ఇక ఈమె ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో హీరోయిన్‌గా కూడా చేసింది. నిజామాబాద్‌కి చెందిన శ్రీముఖి.. టీవీ వ్యాఖ్యాతగా అవకాశం రావడంతో చదువును మధ్యలోనే ఆపేసింది. ‘జులాయి’ తరువాత ‘నేను శైలజ, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ధనలక్ష్మి తలుపు తడితే, సావిత్రి’ వంటి చిత్రాల్లో నటించింది. అంతేగాక తమిళ్, కన్నడ చిత్రాల్లో కూడా నటించింది. జెంటిల్మెన్ మూవీ లో ఓ కీలక పాత్రను పోషించింది. తాజాగా శ్రీముఖి కాస్టింగ్ కౌచ్ పై కొన్ని కీలకమైన వ్యాఖ్యలను చేసింది.

ఈ మధ్య కాలంలో చాలామంది హీరోయిన్స్.. కాస్టింగ్ కౌచ్ గురించి అడిగితే అబ్బే అలాంటిదేమీ లేదు అంటుండటం గమనిస్తూనే ఉన్నాం. కొందరైతే ఉందేమో గాని మాకు ఎదురు కాలేదంటారు. కానీ అవన్నీ పచ్చి అబద్ధాలు. వారు ఎంత మసిపూసి మారేడు కాయ చేయాలని చూసినా వాస్తవం దాగదు.

ప‌రిశ్ర‌మ‌కు వచ్చిన ప్రతి అమ్మాయికి ఏదో విధంగా, ఎవ‌రో ఒక‌రి నుంచి వేధింపులు ఎదురవుతాయి. వాటి నుండి లౌక్యంగా త‌ప్పించుకుని ఎదిగిన వారే పరిశ్రమలో ఉంటారు. కొందరు అవకాశాల కోసం సర్వం అర్పించి మోస పోయామని తిరిగి వెళ్లిపోవడం లేక ఫైర్ బ్రాండ్లుగా మారడం చేస్తారు.

ఒక స్థాయి నటిగా ఎదిగే వరకు ఇలాంటి ఇబ్బందులు తప్పవు. నిఖిల్ వంటి వారినే హీరోని చేస్తామని డబ్బులు తీసుకున్న సినీ పరిశ్రమలో ఆడ వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే.. శ్రీముఖి పరిశ్రమకు వచ్చిన కొత్తల్లో కాస్టింగ్ కౌచ్‌కి గురైనట్టు ఓపెన్‌గా చెప్పేసి.. అందరికీ షాకిచ్చింది.

అవకాశాలు కోసం ప్రయత్నిస్తుండగా ఓ పెళ్లయిన దర్శకుడు కలవమన్నారు. అక్కడకు వెళ్ళాక అసభ్యంగా ప్రవర్తించాడు. హీరోయిన్‌గా ఆఫర్ ఇస్తా కమిట్మెంట్ ఇస్తావా.. రూమ్‌కి వస్తావా? అని అడిగాడు. వెంటనే నేను అక్కడి నుంచి వచ్చేశాను.

అమ్మాయిలకు పరిశ్రమలో వేధింపులు ఎదురవుతాయి. ఇక్కడ కాస్టింగ్ కౌచ్ ఉందని శ్రీముఖి కుండ బద్దలు కొట్టింది. లైంగిక వేధింపులకు భయపడి శ్రీముఖి బుల్లితెర యాంకరింగ్ వైపు అడుగులు వేసిందట. యాంకర్స్ లో ప్రస్తుతం చేస్తోన్న షోల సంఖ్య పరంగా చూస్తే ఆమె నెంబర్ వన్.

ప్రస్తుతం యాంక‌ర్ల సంఖ్య బాగా పెరిగిపోతోంది. ఇప్పటికే అనసూయ పూర్తిగా యాంకరింగ్ వదిలేసింది. సుమ కూడా యాంకరింగ్‌ను తగ్గించే ప్రయత్నాలలో ఉందని మాత్రం సమాచారం. అలా చూసుకుంటే రాబోయే కాలంలో శ్రీముఖి మరింతగా బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఆమె జాతి రత్నాలు, స్టార్ మా పరివార్, మిస్టర్ అండ్ మిసెస్.. ఇలా నాలుగు ఐదు షోలకు యాంకర్ గా పనిచేస్తుంది. కొత్తగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్‌తో ‘బీబీ జోడి’ అనే డాన్స్ రియాల్టీ షో స్టార్ట్ చేశారు. ఈ షోకి కూడా శ్రీముఖినే యాంకర్. కానీ ఏదో ఒకనాడు అనసూయ మాదిరిగా పూర్తిగా సినిమాలతో బిజీ కావాలని సినీనటిగా పేరు తెచ్చుకోవాలని శ్రీ‌ముఖి ఆశ పడుతోంద‌ట‌.

Updated On 4 Jan 2023 8:53 AM GMT
krs

krs

Next Story