విధాత: తెలుగులో జగపతిబాబు, శ్రీకాంత్ ఇద్దరు ఫ్యామిలీ హీరోలుగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇద్దరూ కలిసి, వేర్వేరుగా కూడా కొన్ని చిత్రాలలోను నటించారు. 2001 సంవత్సరం తర్వా వీరి ఛరిష్మా తగ్గుతూ రావడంతో గెస్ట్ పాత్రలు, సపోర్టింగ్ పాత్రలు చేస్తు వచ్చారు. ఆ తర్వాత జగపతిబాబు లెజండ్ సినిమాలో విలన్‌గా చేసిన తర్వాత ఆయన రాతే మారిపోయింది. హీరోగా కూడా చూడనంతా సక్సెస్ చూస్తున్నాడు. చేతి నిండా భారీ సినిమాలతో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా యమా స్పీడ్‌గా […]

విధాత: తెలుగులో జగపతిబాబు, శ్రీకాంత్ ఇద్దరు ఫ్యామిలీ హీరోలుగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇద్దరూ కలిసి, వేర్వేరుగా కూడా కొన్ని చిత్రాలలోను నటించారు. 2001 సంవత్సరం తర్వా వీరి ఛరిష్మా తగ్గుతూ రావడంతో గెస్ట్ పాత్రలు, సపోర్టింగ్ పాత్రలు చేస్తు వచ్చారు. ఆ తర్వాత జగపతిబాబు లెజండ్ సినిమాలో విలన్‌గా చేసిన తర్వాత ఆయన రాతే మారిపోయింది. హీరోగా కూడా చూడనంతా సక్సెస్ చూస్తున్నాడు. చేతి నిండా భారీ సినిమాలతో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా యమా స్పీడ్‌గా దూసుకుపోతున్నారు.
కానీ శ్రీకాంత్ పరిస్థితి మాత్రం అటు ఇటు కాకుండా తయారైంది. జగపతిబాబు మాదిరి శ్రీకాంత్ చేస్తున్న ప్రయత్నాలేవి కలిసి రావడం లేదు. ఒకటి రెండు సినిమాలు చేస్తున్నప్పటికీ జగపతిబాబుకు వచ్చినట్టుగా స్టార్‌డమ్ దక్కడం లేదు. సినిమాల్లోకి వచ్చిన మొదట్లో చిన్నా, చితకా విలన్ వేశాలేసిన శ్రీకాంత్ మళ్లీ నాగచైతన్య హీరోగా వచ్చిన యుద్ధం శరణం అనే సినిమాలో పూర్తిస్థాయి విలన్‌గా చేశాడు.
ఆ తరువాత విలన్ అనే మలయాళ సినిమా, ది విలన్ అనే కన్నడ సినిమాల్లో కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో కనిపించారు. ఆ తర్వాత అఖండ సినిమాలో పవర్‌ఫుల్ పాత్ర దక్కినప్పటికీ.. సినిమాకు వచ్చిన పేరులో సగం సక్సెస్ కూడా ఆయనకు లభించలేదు.
అఖండ తర్వాత శ్రీకాంత్ కేవలం విలన్ పాత్రలకే పరిమితం అవుతాడనని అంతా అనుకుంటున్న సమయంలో హీరో అన్నయ్య పాత్రలు కూడా చేస్తూ వస్తున్నారు. ఇటీవలే విజయ్ నటించిన వారసుడు చిత్రంలో అన్నయ్య పాత్రలో కనిపించాడు.
ప్రస్తుతం శ్రీకాంత్ సుధీర్‌బాబు హీరోగా వస్తున్న Hunt అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఈ చిత్రం ద్వారా అయినా సరైన హిట్ అందుకుంటాడో లేదో చూడాలి. శ్రీకాంత్ ప్రస్తుతం శంకర్- రామ్ చరణ్ కాంబోలో రూపొందుతున్న ఆర్సీ 15 చిత్రంలో నటిస్తున్నాడు. దీని ద్వారా అయినా శ్రీకాంత్ సెకండ్ ఇన్నింగ్స్ వర్కౌట్ అవుతుందేమో చూడాలి.
ఇక శ్రీకాంత్ కుమారుడు రోషన్ రెండేండ్ల కింద పెళ్లి సందడి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రీలీల దూసుకుపోతుండగా రోషన్ మరో సినిమా పట్టాలెక్కలేదు. దీంతో శ్రీకాంత్ తన కుమారుడి కెరీర్‌పై దృష్టి సారించాడు. రోషన్‌ని హీరోగా నిలబెట్టేందుకు తనకున్న పరిచయాలతో తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.
