Asia Cup 2023 | విధాత: ఆసియా కప్‌లో మంగళవారం శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ మధ్య థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. సూపర్ 4 రౌండ్ కి ఆఫ్ఘనిస్తాన్ అర్హత సాధించాలంటే 37.2 ఓవర్లలో 292 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండగా, ఆ జట్టు 37.4 ఓవర్స్‌లో 289 పరుగులకి ఆలౌట్ అయింది.ఈ నేపథ్యంలో శ్రీలంక రెండు పరుగుల తేడాతో గెలిచి సూపర్ 4లోకి అడుగుపెట్టింది. దీంతో గ్రూప్ బీ నుండి శ్రీలంక , బంగ్లాదేశ్ సూపర్ 4 స్టేజీకి […]

Asia Cup 2023 |
విధాత: ఆసియా కప్‌లో మంగళవారం శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ మధ్య థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. సూపర్ 4 రౌండ్ కి ఆఫ్ఘనిస్తాన్ అర్హత సాధించాలంటే 37.2 ఓవర్లలో 292 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండగా, ఆ జట్టు 37.4 ఓవర్స్‌లో 289 పరుగులకి ఆలౌట్ అయింది.ఈ నేపథ్యంలో శ్రీలంక రెండు పరుగుల తేడాతో గెలిచి సూపర్ 4లోకి అడుగుపెట్టింది. దీంతో గ్రూప్ బీ నుండి శ్రీలంక , బంగ్లాదేశ్ సూపర్ 4 స్టేజీకి అర్హత సాధించాయి.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసింది.నిశ్శంక 40 బంతుల్లో 6 ఫోర్లతో 41 పరుగులు చేయగా దిముత్ కరుణరత్నే 35 బంతుల్లో 6 ఫోర్లతో 32 పరుగులు, కుసాల్ మెండిస్ 84 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 92 పరుగులు చేయడంతో శ్రీలంక మూడు వందల మార్కు దగ్గర వరకు వచ్చింది.
అయితే భారీ లక్ష్య చేనలో ఆఫ్ఘనిస్తాన్ తొలిమూడు వికెట్లు స్వల్ప వ్యవధిలోనే కోల్పోయింది. రెహ్మనుల్లా గుర్భాజ్ 4, ఇబ్రహీం జద్రాన్ 7 పరుగులు, గుల్బాదీన్ నయీబ్ 22 పరుగులకి ఔట్ కావడంతో ఆఫ్ఘాన్ 50 పరుగులకి 3 వికెట్స్ కోల్పోయి కష్టాలలో పడింది. ఆ సమయంలో రెహ్మత్ షా 40 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 45 పరుగులు, కెప్టెన్ హస్మతుల్లా షాహిదీ 66 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 59 పరుగులు చేసి మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.
ఇక ఆ తర్వాత వచ్చిన మహ్మద్ నబీ 32 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 65 పరుగులు చేసి శ్రీలంక బౌలర్లకి ముచ్చెమటలు పట్టించాడు. 24 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి, ఆఫ్ఘాన్ తరుపున ఫాస్టెస్ట్ వన్డే హాఫ్ సెంచరీ చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. మరి కొద్ది సేపు నబీ ఉండి ఉంటే ఆఫ్ఘాన్ సులువుగా విజయం సాధించి ఉండేది.
మహ్మద్ నబీ ప్రమాదరకంగా మారుతున్న సమయంలో , మహీశ్ తీక్షణ బౌలింగ్‌లో బౌండరీ దగ్గర క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ సమయానికి ఆఫ్ఘానిస్తాన్ సూపర్ 4 రౌండ్‌కి అర్హత సాధించాలంటే 61 బంతుల్లో 91 పరుగులు రాబట్టాల్సి ఉంది. అప్పుడు 13 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 22 పరుగులు చేసిన కరీం జనత్, వెల్లలాగే బౌలింగ్‌లో వెనుదిరిగాడు.
ఇక అదే ఓవర్‌లో ఆఫ్ఘాన్ కెప్టెన్ షాహిదీ కూడా ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రషీద్ ఖాన్, నజీబుల్లా జద్రాన్ కలిసి బౌండరీలు బాదుతూ టీమ్‌ని లక్ష్యంకి దగ్గరగా నడిపించారు. సూపర్ 4 రౌండ్‌కి అర్హత సాధించాలంటే 10 బంతుల్లో 16 పరుగులు కావాల్సిన సమయంలో నజీబుల్లా అవుట్ కాగా, ఆ తర్వాత వెంటవెంటనే ముజీబ్,ఫజల్ హక్ ఫరూక్ ఔట్ కావడంతో రెండు పరుగుల దూరంలో ఆఫ్ఘనిస్తాన్ వెనకబడింది. రషీద్ ఖాన్.. 16 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 27 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
