విధాత: దర్శకధీరుడు రాజమౌళి ఇంతింతై వ‌టుడింతై అన్నట్టుగా సినిమా సినిమాకి తన రేంజ్‌ను పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్‌కు పెంచుకుంటూ వస్తున్నాడు. బాహుబలి -ది బిగినింగ్, బాహుబలి - ది క‌న్‌క్లూజ‌న్ చిత్రాలతో ఈయన పాన్ ఇండియా, పాన్ వ‌ర‌ల్డ్ రేంజ్‌లో పేరు ప్రఖ్యాతలు సాధించాడు. తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఆయన స్థాయి ఇంటర్నేషనల్ లెవెల్‌కి ఎదిగింది. హాలీవుడ్ సినీ ప్రముఖులు సుప్రసిద్ధ దర్శకులు అయిన స్టీవెన్ స్పిల్ బర్గ్, జేమ్స్ కామరూన్‌ల‌తో కలిసి ఆయన […]

విధాత: దర్శకధీరుడు రాజమౌళి ఇంతింతై వ‌టుడింతై అన్నట్టుగా సినిమా సినిమాకి తన రేంజ్‌ను పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్‌కు పెంచుకుంటూ వస్తున్నాడు. బాహుబలి -ది బిగినింగ్, బాహుబలి - ది క‌న్‌క్లూజ‌న్ చిత్రాలతో ఈయన పాన్ ఇండియా, పాన్ వ‌ర‌ల్డ్ రేంజ్‌లో పేరు ప్రఖ్యాతలు సాధించాడు. తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఆయన స్థాయి ఇంటర్నేషనల్ లెవెల్‌కి ఎదిగింది.

హాలీవుడ్ సినీ ప్రముఖులు సుప్రసిద్ధ దర్శకులు అయిన స్టీవెన్ స్పిల్ బర్గ్, జేమ్స్ కామరూన్‌ల‌తో కలిసి ఆయన ప్రత్యేకంగా ముచ్చటించే స్థాయికి ఎదిగాడు. ఆర్ఆర్ఆర్ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోవడమే కాకుండా రివార్డులను అవార్డులను కూడా గెలుచుకుంటుంది.

కాగా పదేళ్ల కిందట రాజమౌళి దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌లో కేఎల్ నారాయణ‌కు ఓ సినిమా చేస్తానని హామీ ఇచ్చాడు. మహేష్ బాబుతో ఆ సినిమా ఉంటుందని ఆనాడు నారాయణకు హామీ ఇచ్చిన రాజమౌళి ఇప్పుడు తానున్న రేంజ్‌ని మర్చిపోయి.. తన మాటకు కట్టుబడి నారాయణతో కలిసి మహేష్ బాబు‌తో SSMB 29ను తెర‌కెక్కించే పనిలో ఉన్నాడు.

తాజాగా ఆయన తన కొత్త సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మహేష్ బాబుతో తాను సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. పదేళ్ల నుంచి ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఈ మూవీ గ్లోబల్ అడ్వెంచర్‌గా రూపొందనుంది. ప్రస్తుతం కథను తయారు చేసే పనిలో ఉన్నాం. ఈ చిత్రం కోసం సీఏఏ‌తో ఒప్పందం చేసుకున్నాను. దాని ద్వారా ప్రపంచ సినిమాలు అర్థం చేసుకోగల ప్రతిభావంతులు పరిచయం అయ్యారు.

ఇండియాలో ఫిలిం మేకింగ్, యూఎస్‌లో ఫిలిం మేకింగ్ రెండు విభిన్నంగా ఉంటాయి. కాబట్టి దానిని ఫైనల్ చేసేందుకు ఇంకొంత సమయం పడుతుంది అని చెప్పాడు. ఇక ఈయన సిఏఏ ఏజెన్సీ పేరు ఎత్తడంతో దానిపై ప్రస్తుతం అందరూ ఫోకస్ చేశారు. సీఏఏ పూర్తి పేరు క్రియేటివ్ ఆర్టిస్ట్ ఏజెన్సీ. ప్రతిభను ప్రోత్సహించడం దీని ఉద్దేశం. లాస్ ఏంజెల్స్ కేంద్రంగా కార్యకలాపాలు సాగుతుంటాయి. వేలాది మంది దర్శకులు, రచయితలు, సంగీత దర్శకులు, నటీనటులకు సీఏఏ ప్రాతినిధ్యం వహిస్తుంది. సినిమాలోని 24 రంగాలకు సంబంధించిన నిపుణుల అవసరం మేరకు ఆ సంస్థ పనిచేస్తూ ఉంటుంది.

ఏ నిర్మాత, దర్శకుడైనా.. సినిమా తీయదలచి ఈ ఏజెన్సీని సంప్రదిస్తే అక్కడ రైటర్లు స్టోరీలు ఇస్తూ ఉంటారు. అక్కడే నటీనటులు టెక్నీషియన్స్‌ని కూడా ఎంపిక చేసుకోవచ్చు. అలా ఈ సంస్థ హాలీవుడ్ సినిమాలకు పని చేస్తూ ఉంటుంది. అలాంటి ఏజెన్సీ ఇప్పుడు రాజమౌళి చిత్రానికి అందునా.. మ‌న తెలుగు సినిమాకు పని చేస్తూ ఉండడం చాలా ఆసక్తిని రేపుతోంది. రాజమౌళి సినిమాలంటే విజువ‌ల్ ట్రీట్‌గా ఉంటాయి. దాంతో ఆయన గ్రాఫిక్స్ కోసమే సిఏఏతో ఒప్పందం కుదుర్చుకున్నాడ‌ని కూడా చర్చ సాగుతోంది.

Updated On 21 Jan 2023 2:19 PM GMT
krs

krs

Next Story