Saturday, April 1, 2023
More
    HomelatestSSMB 28: 13 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్‌, మహేశ్‌ సినిమా.. అప్పుడే రూ. 90 కోట్లకు...

    SSMB 28: 13 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్‌, మహేశ్‌ సినిమా.. అప్పుడే రూ. 90 కోట్లకు బిజినెస్

    SSMB28 Mahesh Babu

    విధాత‌: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఎలాంటి సినిమా చేసినా కూడా బిజినెస్ హై రేంజ్‌లో జ‌రుగుతుంది. ఇక డైరెక్టర్‌తో కాంబినేషన్ క్లిక్ అయితే పాత రికార్డులు బ్లాస్ట్ అవుతాయి. ‘అతడు, మహేష్ ఖలేజా’ వంటి సినిమాల త‌ర్వాత చాలా కాలానికి మ‌హేష్ బాబు, త్రివిక్రమ్ (Trivikram) క‌లిసి సినిమా చేస్తున్నారు.

    మహేష్ బాబు 28వ సినిమాగా ఈ సినిమా రూపొందుతోంది. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. వీరిద్దరి కాంబినేషన్లో దాదాపు 13 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో టాలీవుడ్ ట్రేడ్ వర్గాల వారికి కూడా సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. ఇప్పటికే ఈ సినిమాకి మంచి మంచి ఆఫర్లు వ‌చ్చాయ‌ట‌. ఈ విషయంలో ఒక ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

    ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఓటిటి హక్కులు కొనుగోలు చేసిన‌ట్లు నెట్‌ఫిక్స్ సంస్థ చాలా రోజుల క్రితమే ప్రకటించింది. అయితే ఈ సంస్థ మహేష్ బాబు సినిమాని భారీ ధరకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. నిజానికి నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసినట్టు స్వయంగా ప్రకటించుకుంది.

    కానీ ఇంకా రేటు ఖ‌రారు కాలేద‌ని అంటున్నారు. అన్ని భాషలకు రేటు 70 కోట్లకు తగ్గేది లేదని మాత్రం చెబుతున్నారు. నెట్ ఫ్లిక్స్ కొంత బేరం ఆడుతున్నట్టుగా తెలుస్తోంది. అధికారికంగా ప్రకటన చేశారు కాబట్టి కొంచెం ఎక్కువైనా.. ఇక నెట్‌ఫ్లిక్స్ దీనిని దక్కించుకోవడం తప్పదని అంటున్నారు.

    మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ సినిమా ఆడియో హక్కులను కూడా ప్రముఖ ఆడియో సంస్థ 20 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. గత వారం రోజులకు పైగా నిర్మాతలతో ప్రముఖ ఆడియో సంస్థ చర్చలు జరుపుతోంది.

    తమన్ కూడా ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి ఈ రూట్లో భారీగా ఆదాయం పొందే అవకాశం ఉంది. ఈ డీల్ ఓకే అయితే న్యూ రికార్డు క్రియేట్ అయినట్టే. అలా ఓటీటీ, ఆడియో రైట్స్‌తో.. నాన్ థియేట్రిక‌ల్ బిజినెస్‌ పరంగా.. ఈ సినిమా దాదాపు 90 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది.

    ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది. త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీ‌లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్‌పై ఈ సినిమాని చిన్నబాబు, నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular