విధాత: శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంతో అభివృద్ధి చెందాయ‌ని, మ‌నిషి ఆధునిక మాన‌వుడిగా ఎదిగాడ‌ని ఎంత చెప్పుకొన్నా ఆచ‌ర‌ణ‌లో అణువంతైనా మార‌లేదు. ఉద్యోగ నిర్వ‌హ‌ణ మొద‌లు, రోజువారీ కార్య‌క్ర‌మాల ప్రారంభానికి కూడా మ‌నిషి గ్ర‌హ‌బ‌లాల‌ను, రాశి ఫ‌లాల‌ను చూసుకొనే అడుగులు వేస్తున్నాడు. ఆధునిక యుగంలో మ‌నిషి జెట్ వేగంతో ప‌రిగెడుతున్నాడు. శాస్త్ర‌, సాంకేతిక రంగాల ద‌న్నుతో స‌మ‌స్త ప్ర‌పంచాన్ని జేబులో పెట్టుకొని అన్నింట్లో తానే అగ్ర‌గామిగా ఉండేందుకు ఆరాట ప‌డుతున్నాడు. అయితే.. త‌న ఆరాట, పోరాటాల‌కు అత‌నికున్న […]

విధాత: శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంతో అభివృద్ధి చెందాయ‌ని, మ‌నిషి ఆధునిక మాన‌వుడిగా ఎదిగాడ‌ని ఎంత చెప్పుకొన్నా ఆచ‌ర‌ణ‌లో అణువంతైనా మార‌లేదు. ఉద్యోగ నిర్వ‌హ‌ణ మొద‌లు, రోజువారీ కార్య‌క్ర‌మాల ప్రారంభానికి కూడా మ‌నిషి గ్ర‌హ‌బ‌లాల‌ను, రాశి ఫ‌లాల‌ను చూసుకొనే అడుగులు వేస్తున్నాడు.

ఆధునిక యుగంలో మ‌నిషి జెట్ వేగంతో ప‌రిగెడుతున్నాడు. శాస్త్ర‌, సాంకేతిక రంగాల ద‌న్నుతో స‌మ‌స్త ప్ర‌పంచాన్ని జేబులో పెట్టుకొని అన్నింట్లో తానే అగ్ర‌గామిగా ఉండేందుకు ఆరాట ప‌డుతున్నాడు. అయితే.. త‌న ఆరాట, పోరాటాల‌కు అత‌నికున్న వ‌న‌రులు, వ‌స‌తులు ప్రాతిప‌దిక‌గా ఉండ‌టం లేదు. ఆ రోజున్న రాశి ఫ‌లం, గ్ర‌హ‌బ‌ల‌మే పునాదిగా ఉండ‌ట‌మే ఆశ్చ‌ర్యం.

ఈ నేప‌థ్యంలోనే.. పొద్దున లేచింది మొద‌లు అత్య‌ధికులు చూసిన‌, చూస్తున్న విష‌యం ఏద‌య్యా అంటే.. రాశిఫ‌లాలు. అందుక‌నే.. ఈ మ‌ధ్య ఓ సామాజిక శాస్త్ర‌వేత్త ఏమ‌న్నాడంటే.. భార‌తీయుల కాళ్లు శాస్త్ర సాంకేతిక‌త‌తో చంద్ర మండ‌లంపై ఉంటే.. మెద‌డు మాత్రం మ‌ధ్య‌యుగాల్లో ఉన్న‌దని.

Updated On 17 Nov 2022 7:41 AM GMT
krs

krs

Next Story