క్రీడాకారులకు హాస్టల్ కోసం కృషి చేస్తాన‌ని హామీ విధాత, మెదక్ బ్యూరో: వయస్సుకు రిటైర్మెంట్ లేదని, వయస్సు పైబడినా యువకుల్లా క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనడం ముదాహమని, నేటి యువతకు మార్గదర్శకంగా నిలుస్తారని మెదక్ ఎమ్మల్యెే పద్మా రెడ్డి అన్నారు. మనం చిన్నప్పుడు ఎన్నో క్రీడలు ఆడామని, కానీ నేడు యువత చరవాణిలను, వీడియో గేమ్స్ కు ఇచ్చినటువంటి ప్రాధాన్యత క్రీడలకు ఇవ్వడం లేదని అన్నారు. శనివారం ఇందిరాగాంధీ స్టేడియంలో రెండు రోజుల పాటు నిర్వహించే నేషనల్ మాస్టర్స్ […]

  • క్రీడాకారులకు హాస్టల్ కోసం కృషి చేస్తాన‌ని హామీ

విధాత, మెదక్ బ్యూరో: వయస్సుకు రిటైర్మెంట్ లేదని, వయస్సు పైబడినా యువకుల్లా క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనడం ముదాహమని, నేటి యువతకు మార్గదర్శకంగా నిలుస్తారని మెదక్ ఎమ్మల్యెే పద్మా రెడ్డి అన్నారు. మనం చిన్నప్పుడు ఎన్నో క్రీడలు ఆడామని, కానీ నేడు యువత చరవాణిలను, వీడియో గేమ్స్ కు ఇచ్చినటువంటి ప్రాధాన్యత క్రీడలకు ఇవ్వడం లేదని అన్నారు.

శనివారం ఇందిరాగాంధీ స్టేడియంలో రెండు రోజుల పాటు నిర్వహించే నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ తొమ్మిదవ తెలంగాణ స్టేట్ ఛాంపియన్ షిప్ -2023 అథ్లెటిక్ క్రీడా పోటీలను క్రీడాజ్యోతిని వెలిగించి, క్రీడల పతాకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. అనంత‌రం వారి నుండి గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 35 సంవత్సరల నుండి 95 సంవత్సరాల వయస్సు పైబడిన వారు ఈ అథ్లెటిక్స్ పోటీలో పాల్గొనడం విశేషమన్నారు. 25 జిల్లాల నుండి 23 క్రీడా అంశాలతో 715 మంది క్రీడాకారులు ఈ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.

ఇక్కడ గెలుపొందిన వారు ఫిబ్రవరి 15,16 న హర్యానాలో జరిగే అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనడం జరుగుతుందని, అక్కడ మంచి ప్రతిభ కనబరిచిన వారికి సన్మానం ఏర్పాటు చేస్తామని పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు.

వయస్సుతో సంబంధం లేకుండా "కృష్ణా రామ" అనే వయసులో హై జంపు, లాంగ్ జంపు పోటీల్లో పాల్గొన్న వారిని చూసి దేశంలో ఉన్న యువత స్ఫూర్తి పొందాలని కోరారు. క్రీడల ద్వారా శారీరక దృఢ‌త్వం కలిగి ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటారని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మెదక్ జిల్లా కేంద్రం ఏర్పడి ఏడున్నర కోట్లతో సింథటిక్ ట్రాక్ ను ఏర్పరచుకొని నేడు అథ్లెక్స్ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా కేంద్రంలో స్పోర్ట్స్ హాస్టల్ ఆవశ్యకత అవసరముందని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏప్రిల్ మాసంలో జిల్లాకు వచ్చే అవకామేశముందని ఆ సందర్భంగా క్రీడాకారుల వసతికి హాస్టల్ ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు.

వచ్చే స్పోర్ట్స్ మీట్ కూడా మెదక్ లో పెట్టేలా కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా అథ్లెటిక్స్ లో పాల్గొని షాట్ ఫుట్ వేసి క్రీడాకారులను ప్రోత్సహించారు.

కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ చంద్ర పాల్‌, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, అథ్లెటిక్స్ ఆర్గనైజషన్ కమిటీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆంజనేయ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, మర్రి లక్ష్మణా రెడ్డి, జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు

Updated On 21 Jan 2023 12:23 PM GMT
krs

krs

Next Story