వేలంలో రూ. 1.78 కోట్లు పలికిన స్టీవ్ జాబ్స్ చెప్పులు
Steve Jobs | యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ధరించిన చెప్పులు వేలంలో కోట్లు పలికాయి. స్టీవ్ జాబ్స్ 1970లలో వాడిన చెప్పులను వేలం వేయగా.. రూ. 1.78 కోట్లు పలికింది. అమెరికాలో జూలియెన్స్ అనే కంపెనీ ఆదివారం నిర్వహించిన వేలంలో స్టీవ్ జాబ్స్ బిర్కెన్ స్టాక్ కంపెనీ సాండల్స్ రూ. 1.78 కోట్లు పలికాయి. వేలాన్ని నవంబర్ 11న ప్రత్యక్ష ప్రసారం చేయగా, 13న ముగిసింది. అయితే ఈ చెప్పుల మీద స్టీవ్ జాబ్స్ […]

Steve Jobs | యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ధరించిన చెప్పులు వేలంలో కోట్లు పలికాయి. స్టీవ్ జాబ్స్ 1970లలో వాడిన చెప్పులను వేలం వేయగా.. రూ. 1.78 కోట్లు పలికింది. అమెరికాలో జూలియెన్స్ అనే కంపెనీ ఆదివారం నిర్వహించిన వేలంలో స్టీవ్ జాబ్స్ బిర్కెన్ స్టాక్ కంపెనీ సాండల్స్ రూ. 1.78 కోట్లు పలికాయి. వేలాన్ని నవంబర్ 11న ప్రత్యక్ష ప్రసారం చేయగా, 13న ముగిసింది. అయితే ఈ చెప్పుల మీద స్టీవ్ జాబ్స్ కాలి ముద్రలు ఉన్నాయి. అందుకని ఈ చెప్పుల్ని ఒకాయన రూ. 1.78 కోట్లకు వేలంలో సొంతం చేసుకున్నారు.
స్టీవ్ జాబ్స్ యాపిల్ చరిత్రలో చాలా కీలకమైన సందర్భాల్లో ఈ చెప్పులను ధరించారు. 1976లో యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్‌తో కలిసి లాస్ అల్టోస్ గ్యారేజీలో ఈ చెప్పులను ధరించి యాపిల్ కంప్యూటర్‌ను ప్రారంభించారు. స్టీవ్ జాబ్స్ ధరించిన చెప్పులను 2017లో ఇటలీలోని మిలానోలోని సలోన్ డెల్ మొబైల్‌తో సహా పలు ప్రదర్శనల్లో ఉంచారు.
