విధాత: తమారా ఈక్విడార్ నుంచి స్పెయిన్ వెళ్లాల్సి ఉంది. అందుకు కెఎల్ఎం రాయల్డచ్ విమానం ఎక్కింది. ఆ విమానం మధ్యలో నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్లో ఆగుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి తమారా స్పెయిన్ లోని మాడ్రిడ్ చేరుకోవాలనేది ఆమె లక్ష్యం.
అందరిలాగే తమారా రాయల్ డచ్విమానం ఎక్కింది. మరో కొద్ది సేపట్లో ఆమ్స్టర్డామ్లో విమానం ల్యాండ్ అవుతుందనగా తమారాకు కడుపులో నొప్పి అనిపించింది. వెంటనే ఆమె రెస్ట్రూములోకి వెళ్లింది. నొప్పులు మరింత తీవ్రమయ్యాయి.
విషయం విమాన సిబ్బంది గ్రహించి విమానంలో ఎవరైనా వైద్యులున్నారమేమోనని వాకబ్ చేశారు. అందులో ఇద్దరు వైద్యులు ఓ నర్స్ ఉన్నట్లు తెలిసి వచ్చింది. వారిని తమారాకు అవసరమైన చికిత్స అందించ వలసిందిగా విమాన సిబ్బంది కోరారు.
ఆ వైద్యుల పర్యవేక్షణలో తమారా పండండి బిడ్డకు జన్మనిచ్చింది. విమానాశ్రయంలో విమానం దిగిన వెంటనే తల్లి బిడ్డలను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడు తల్లీ తమారా, బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు. విషయం ఏమంటే.. తాను గర్భవతినని తామారాకు కూడా తెలియదట. సాధారణ కడుపునొప్పి అనుకొంటే.. బిడ్డ పుట్టిందని ఒకింత ఆశ్చర్యంగా సంతోషం వ్యక్తం చేస్తున్నదట!