China | విధాత: అలరించే, ఆలోచింపజేసే ట్వీట్లు పెట్టే పారిశ్రామికవేత్తల్లో ఆనంద్ మహేంద్ర, హర్ష్ గోయెంకా ముందు వరసలో ఉంటారు. వారు పెట్టే ట్వీట్లపైన ఎక్కువ చర్చ జరుగుతుంది. తాజాగా హర్ష్ గోయెంకా ఎక్స్‌లో చేసిన ఒక ట్వీట్ సరదా చర్చకు కేంద్రమైంది. చైనాలోని హునాన్ ప్రాంతంలో ఉన్న నిట్టనిలువు కొండ వాలులో ఉన్న చిన్న బడ్డీ కొట్టు ఫొటోను ఆయన తన పోస్ట్ చేశారు. ఈ బడ్డీ కొట్టులో స్నాక్స్, ఇతర చిరుతిళ్లు ఉంటాయి. ఈ […]

China |
విధాత: అలరించే, ఆలోచింపజేసే ట్వీట్లు పెట్టే పారిశ్రామికవేత్తల్లో ఆనంద్ మహేంద్ర, హర్ష్ గోయెంకా ముందు వరసలో ఉంటారు. వారు పెట్టే ట్వీట్లపైన ఎక్కువ చర్చ జరుగుతుంది.
తాజాగా హర్ష్ గోయెంకా ఎక్స్‌లో చేసిన ఒక ట్వీట్ సరదా చర్చకు కేంద్రమైంది. చైనాలోని హునాన్ ప్రాంతంలో ఉన్న నిట్టనిలువు కొండ వాలులో ఉన్న చిన్న బడ్డీ కొట్టు ఫొటోను ఆయన తన పోస్ట్ చేశారు.
ఈ బడ్డీ కొట్టులో స్నాక్స్, ఇతర చిరుతిళ్లు ఉంటాయి. ఈ కొండ పర్వతారోహకులకు ప్రసిద్ధి చెందినది కావడంతో వారు ఇక్కడ తినుబండారాలు కొనుక్కొని సేద తీరుతారు. మీకు ఈ షాపులో ఉద్యోగం కావాలనుకుంటే అప్లై చేయండి అని ట్వీట్‌కు వ్యాఖ్యను జోడించారు.
దీనిపై యూజర్లు పలు రకాలుగా స్పందించారు. జీతం ఇచ్చి, భోజనం పెడితే ఈ ఉద్యోగానికి సిద్ధమని ఒకరు, మా స్నేహితుడు నిరుద్యోగి అని అతడికి ఫార్వర్డ్ చేస్తానని మరొకరు ఇలా స్పందనలు వచ్చాయి.
మరొకరు ఒక అడుగు ముందుకు వేసి.. అక్కడ మన ఎస్‌బీఐ ఏటీఎంను పెట్టాలని.. పర్వాతారోహకులు అక్కడ డబ్బులు డ్రా చేసి.. షాపులో చిరుతిళ్లు కొనుక్కుంటారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.
