విధాత‌: తెలుగు ప్రేక్షకులకు ఒకప్పుడు హీరోగా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సీనియర్ నరేష్ అందరికీ పరిచమయే. విజయ నిర్మ‌ల మొదటి భర్తకు జ‌న్మించిన కుమారుడైన ఈయన విజయనిర్మల దర్శకత్వం వహించిన ప్రేమ సంకెళ్లు అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. పండంటి కాపురం చిత్రంతోనే బాలనటునిగా తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఎందుకనో కమెడియన్‌గా ట‌ర్న్‌ తీసుకున్నాడు. కామెడీ హీరోగా శ్రీవారికి ప్రేమలేఖలు, చిత్రం భళారే విచిత్రం, జంబలకడిపంబ, నాలుగు స్తంభాలాట, రెండు జళ్ళ సీత, […]

విధాత‌: తెలుగు ప్రేక్షకులకు ఒకప్పుడు హీరోగా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సీనియర్ నరేష్ అందరికీ పరిచమయే. విజయ నిర్మ‌ల మొదటి భర్తకు జ‌న్మించిన కుమారుడైన ఈయన విజయనిర్మల దర్శకత్వం వహించిన ప్రేమ సంకెళ్లు అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యాడు.

పండంటి కాపురం చిత్రంతోనే బాలనటునిగా తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఎందుకనో కమెడియన్‌గా ట‌ర్న్‌ తీసుకున్నాడు. కామెడీ హీరోగా శ్రీవారికి ప్రేమలేఖలు, చిత్రం భళారే విచిత్రం, జంబలకడిపంబ, నాలుగు స్తంభాలాట, రెండు జళ్ళ సీత, పుత్తడి బొమ్మ, పోలీస్ భార్య వంటి చిత్రాలలో హీరోగా రాణించాడు.

వాజ్‌పేయి నాయకత్వంలో నాడు బిజెపిలో చురుకైన పాత్ర పోషించి రాష్ట్ర జనరల్ సెక్రెటరీ స్థాయికి ఎదిగాడు. 2009లో పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయాడు. తర్వాత బిజెపిని వదిలిపెట్టాడు. ఇక ఈయన తన మొదటి వివాహాన్ని సీనియర్ కెమెరామెన్ శ్రీను కుమార్తెతో చేసుకున్నాడు.

ఆ తర్వాత రెండో పెళ్లి జరిగింది. అది కూడా విడాకుల వరకు వెళ్ళింది. 50 ఏళ్ల వయసులో కాంగ్రెస్ నాయకుడు రఘువీరా రెడ్డి సోదరుడి కుమార్తె రమ్యను వివాహం చేసుకున్నాడు. తాజాగా తన సహనటి పవిత్ర లోకేష్‌తో నాలుగో పెళ్ళంటూ ప్రకటన ఇచ్చాడు. త్వరలోనే సీనియర్ నరేష్- పవిత్ర లోకేష్ మెడలో మూడు ముళ్ళు వేయనున్నాడు. చాలా కాలంగా నరేష్ పవిత్రలు సహజీవనం చేస్తున్నారు. ఈ విషయాన్ని కూడా స్వయంగా నరేష్ తెలియజేశారు.

ఆయన మాట్లాడుతూ నమ్మదగిన ప్రేమించే ఒకరి తోడు కావాలి. అందుకే పవిత్ర లోకేష్ నేను కలిసి జీవిస్తున్నామని నాడు వెల్లడించాడు. ఇక పెళ్లితో వారి బంధాన్ని అధికారికం చేయనున్నారు. మొత్తానికి మొదటి ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చి నాలుగో వివాహానికి సిద్ధం కావడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది.

62 ఏళ్ల వయసులో పెళ్లి ఏంటని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇక నరేష్ ముగ్గురు భార్యలతో విడిపోవడానికి కారణాలు ఏమిటి? అనే ప్రశ్నలు చాలామందిని వేధిస్తున్నాయి. తాజాగా నరేష్ ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించాడు.

నాకు మొదటి వివాహం చాలా చిన్న వయసులో జరిగింది. 17 ఏళ్లకే నేను హీరో అయ్యాను. 19 ఏళ్ల‌కు వివాహం చేశారు. నా భార్యకు అనారోగ్య సమస్యలు అని తెలిసి ఆ కారణాలతో విడాకులు తీసుకున్నాను. ఆ తర్వాత ఇద్దరు భార్యలతో మనస్పర్ధలు వచ్చి విడిపోయాను.

ఈ విషయంలో ఎవరిని నిందించడానికి లేదు. గతంలో ఒక ఫ్యామిలీ కోర్టు ఉండేది. ఇప్పుడు పదుల సంఖ్యలో ఉన్నాయి. కారణం విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరిగిపోయింది. దీనికి సమాజంలో వచ్చిన మార్పులే కారణం.

ఒకప్పుడు భర్త సంపాదిస్తే భార్య ఇంటి బాధ్య‌త‌లు చూసుకునేది. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తే గాని ఇల్లు గడవని పరిస్థితి. చిన్న కుటుంబాలు పెరిగాక దంపతుల గొడవలు తీర్చేవారు లేకుండా పోయారు. పరిశ్రమలో అందరూ నన్ను ప్లేబోయ్ అనుకోవచ్చు. అలాంటిదేమీ లేదు.

విడాకులు ఇచ్చినప్పటికీ నా మాజీ భార్యలతో ఇప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయి. ముగ్గురు భార్యలకు ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్దబ్బాయి నవీన్ విజయ్ కృష్ణ ఎడిటర్, మరో అబ్బాయి పెయింటింగ్ ఆర్టిస్ట్, మూడో భార్యకు పుట్టిన వాడు ప‌సి ప్రాయంలో ఉన్నాడు అని నరేష్ చెప్పుకొచ్చారు.

ఇక తనకు వివాహ వ్యవస్థపై నమ్మకం లేదని నరేష్ పలు సందర్భాలలో చెప్పిన సంగతి తెలిసిందే. పెళ్లి అనేది కలిసి జీవించడానికి ఒక లైసెన్స్ మాత్రమే అని ప్రకటించిన ఆయ‌న… పవిత్ర లోకేష్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించడం విశేషం. రేపు పవిత్రతో బోర్ కొడితే.. ఏం చేస్తాడో మరి?

Updated On 21 Jan 2023 2:18 PM GMT
krs

krs

Next Story