విధాత: రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు శనివారం 10 పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను ఆమె సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏప్రిల్ 3 నుంచి 13 వరకు టెన్త్ పరీక్షలు జరుగుతాయని అన్నారు. ఈ నెల 24 నుంచి హాల్ టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4లక్షల 94,616 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, ఇందుకు 2,652 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.