Delhi | విధాత: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు భారీ భూ ప్రకంపనలు సంభవించాయి. భయంతో జనాలు తమ నివాసాల నుంచి బయటకు వచ్చారు. అయితే నేపాల్‌లో భూకంపం సంభవించిన తర్వాత.. ఢిల్లీతో పాటు సమీప ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించినట్లు అధికారులు నిర్ధారించారు. నేపాల్ లో భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. ఐదు గంటల వ్యవధిలోనే నేపాల్‌లో రెండు సార్లు భూకంపం సంభవించింది. మంగళవారం రాత్రి 8:52 గంటల సమయంలో తొలిసారి భూకంపం […]

Delhi | విధాత: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు భారీ భూ ప్రకంపనలు సంభవించాయి. భయంతో జనాలు తమ నివాసాల నుంచి బయటకు వచ్చారు. అయితే నేపాల్‌లో భూకంపం సంభవించిన తర్వాత.. ఢిల్లీతో పాటు సమీప ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించినట్లు అధికారులు నిర్ధారించారు.

నేపాల్ లో భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. ఐదు గంటల వ్యవధిలోనే నేపాల్‌లో రెండు సార్లు భూకంపం సంభవించింది. మంగళవారం రాత్రి 8:52 గంటల సమయంలో తొలిసారి భూకంపం ఏర్పడింది. అప్పుడు రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.9గా నమోదైంది.

ఇక ఢిల్లీతో పాటు నోయిడా, గురుగ్రామ్ ఏరియాల్లో 10 సెకన్ల పాటు భూమి కంపించిందని బాధితులు తెలిపారు. ఢిల్లీలో సంభవించిన భూప్రకంపనలపై నెటిజన్లు 20 వేలకు పైగా ట్వీట్లు చేశారు. ఇలాంటి ప్రకంపనలను ఎప్పుడు చూడలేదన్నారు. భయంతో వణికిపోయామని తెలిపారు. గాఢ నిద్రలో ఉన్న సమయంలో బెడ్లు కదలడంతో తీవ్ర ఆందోళనకు గురైనట్లు కొంత మంది నెటిజన్లు పేర్కొన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.

Updated On 9 Nov 2022 3:47 AM GMT
subbareddy

subbareddy

Next Story