విధాత: గ్రంథాలయాల అభివృద్ధికి, పాఠకులకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వ సహకారంతో పాటు దాతల విరాళాల చేయూత అభినందనీయమని రేగట్టె మల్లికార్జున్ రెడ్డి అన్నారు.
శనివారం జిల్లా కేంద్ర గ్రంథాలయానికి నల్గొండ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులు సూరెడ్డి వెంకటరామిరెడ్డి, శశికాంత్, భరణి, అశ్విన్ రూ.30 వేలతో రీడింగ్ టేబుల్స్, కుర్చీలు అందించారు. ఈ సందర్భంగా రేగట్టె దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
వారి స్ఫూర్తితో మరింత మంది గ్రంథాలయాల అభివృద్ధికి ముందుకు రావాలన్నారు. ప్రభుత్వం వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తున్నందునా గ్రంథాలయానికి పాఠకుల తాకిడి పెరిగిందని, వారికి కావాల్సిన వసతుల కోసం దాతల సహకారం తీసుకుంటున్నామన్నారు.
ఈ సందర్భంగా గ్రంథాలయానికి ఫర్నిచర్ అందించిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సూరెడ్డి సరస్వతిని సన్మానించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.