Sukanya | ఇటీవల సోషల్ మీడియాలో సెలబ్రిటీల ప్రేమ, పెళ్లి గురించి అనేక వార్తలు హల్‌చల్ చేస్తుండడం చూస్తున్నాం. కొందరు ఆ వార్తలపై స్పందిస్తుండగా, మరి కొందరు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. అయితే పెద్దరికం, భారతీయుడు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన సుకన్య ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంటుందని ప్రచారం జరుగుతుంది. కొద్ది రోజులుగా ఆమె పెళ్లిపై జోరుగా ప్రచారాలు సాగుతున్న నేపథ్యంలో సుకన్య తాజాగా స్పందించింది. యాభై ఏళ్ల వయసులో నాకు పెళ్లా? ఒక […]

Sukanya |
ఇటీవల సోషల్ మీడియాలో సెలబ్రిటీల ప్రేమ, పెళ్లి గురించి అనేక వార్తలు హల్‌చల్ చేస్తుండడం చూస్తున్నాం. కొందరు ఆ వార్తలపై స్పందిస్తుండగా, మరి కొందరు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. అయితే పెద్దరికం, భారతీయుడు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన సుకన్య ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంటుందని ప్రచారం జరుగుతుంది.
కొద్ది రోజులుగా ఆమె పెళ్లిపై జోరుగా ప్రచారాలు సాగుతున్న నేపథ్యంలో సుకన్య తాజాగా స్పందించింది. యాభై ఏళ్ల వయసులో నాకు పెళ్లా? ఒక వేళ నేను పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నా కూడా వాళ్ళు నన్ను అమ్మ అని పిలవాలా లేక అమ్మమ్మ అని పిలవాలా? అని ఆమె ప్రశ్నించారు.
అసలు ఇప్పుడు తనకి పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పుకొచ్చింది. సుకన్య ఇచ్చిన క్లారిటీతో ఇక ఆమె రెండో పెళ్లిపై పుకార్లు రావని అర్ధమవుతుంది. ఇక సుకన్య విషయానికి వస్తే.. 1991లో దర్శకుడు భారతీరాజా పుదు నెల్లు పుదు నాతు మూవీతో వెండితెరకి పరిచయమైన ఈ భామ తెలుగులో పెద్దరికం అనే చిత్రంతో పలకరించింది.
ఇదే ఆమెకి తెలుగులో తొలి చిత్రం కాగా, ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఆ తర్వాత భారతీయుడు సినిమాలో రెండు భిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించింది. ఇక చివరిగా తెలుగులో శ్రీమంతుడు మూవీలో మహేష్ బాబు తల్లి పాత్రలో కనిపించి అలరించింది.
సుకన్య పర్సనల్ లైఫ్ విషయానికి ఇస్తే.. ఆమె 2002లో శ్రీధర్ రాజ గోపాలన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని అమెరికా వెళ్లింది. ఏడాది పాటు వారిద్దరు చాలా అన్యోన్యంగానే ఉన్నారు. ఏడాది తర్వాత వారికి మనస్పర్ధలు తలెత్తడంతో 2003లో ఆమె విడాకులు తీసుకున్నారు.
విడాకుల తర్వాత ఇండియా వచ్చి అడపాదడపా సినిమాలలో మెరుస్తూ సందడి చేస్తుంది. గతంలో సుకన్య పలు వివాదాలతో కూడా హాట్ టాపిక్‌గా నిలిచింది. అయితే సుకన్య చెన్నైలో ఆ మధ్య రెండు మార్లు వ్యభిచారం నిర్వహిస్తూ రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి.
