Sunil Kumar, Fire Service, DGP
విధాత: జగన్ (Jagan)కు ప్రీతిపాత్రుడయ్యారు.. ఎన్నాళ్ల నుంచో పెండింగ్ ఉన్న ప్రమోషన్ కూడా ఇప్పుడు దక్కింది. ఇక డిజిపి (DGP) అవ్వడమే తరువాయి అనుకున్న సీనియర్ ఐపీఎస్(IPS), సీఐడీ (CID) చీఫ్ సునీల్ కుమార్ (Sunil Kumar) ఇప్పుడు ఉన్నట్లుండి అప్రాధాన్య శాఖకు బదిలీ అయ్యారు. ఆయనకు ఫైర్ సర్వీస్ డీజీ(Fire Service)గా పోస్టింగ్ వేస్తూ ఉత్తర్వులు వచ్చాయ్. ఈ పోస్టును నాన్ ఫోకల్ పోస్టుగా.. ఐపీఎస్(IPS) వాళ్ళు భావిస్తారు. దీంతో ఇప్పుడు సునీల్‌ను ఆ పోస్టుకు బదిలీ చేయడంపై అధికార వర్గాలు ఇదే విషయంపై చర్చించు కుంటున్నాయి.
సీఐడీ హెడ్ సునీల్ కుమార్ (CID Head Sunil Kumar).. గత మూడేళ్ల కాలంలో నిత్యం మీడియాలో ఉంటూ వస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రాజకీయ టార్గెట్స్ ను కొట్టడానికి ఆయన రెట్టించిన ఉత్సాహంతో పరుగెత్తేవారని అంటారు. ముఖ్యంగా వైసీపీ రెబల్ (YCP Rebel) ఎంపీ రఘు రామకృష్ణరాజు (MP Raghuramakrishna Raju) కేసులో ఆయనను శారీరకంగా హింసించి కొట్టారని ఆరోపణలున్నాయి.
ఎంపీ రఘురామ కూడా ఇదే విషయాన్ని పలుమార్లు మీడియా ముందు వెళ్లగక్కారు. ఇంకా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్స్ పోస్టులు పెట్టిన టీడీపీ(TDP) కార్యకర్తలు నేతలపై అర్ధరాత్రి.. అని కూడా చూడకుండా ఇళ్లకు వెళ్లి అరెస్టులు చేయడం వంటివి తెలిసిందే.
అయితే.. అదే సమయంలో ఆయనపై కేంద్ర హోం శాఖకు ఫిర్యాదులు కూడా వెల్లువెత్తాయి. రిజర్వేషన్ కోటాలో ఉద్యోగం పొందారని.. కానీ ఆయనకు రిజర్వేషన్ వర్తించదని కేసులు నమోదయ్యాయి. ఇంకా ఒక మతానికి సంబంధించి ప్రచారం చేశారనే వాదన కూడా రావడం.. దీనిపై కేంద్రం సీరియస్ కావడం తెలిసిందే. ఈ క్రమంలోనే సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ మీద చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ క్రమంలో సునీల్ మీద చర్యలు తీసుకోవాలంటూ.. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి (DGP Rajendranath Reddy)ని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి (Chief Secretary Jawahar Reddy)సూచించారు. ఈ తరుణం లోనే ఆయన్ను మారుమూల శాఖకు పంపేశారు. ఆయన జగన్‌కు ఇష్టుడు అయ్యారని.. త్వరలో డిజిపి అవుతారని కూడా అన్నారు.. ఇంకా ఆయన తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎంపీ.. ఎమ్మెల్యేగా వైసిపి నుంచి పోటీ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి.