HomelatestSuperstar Rajinikanth | రజనీపై YCP అభిమానుల గుస్సా.. బాధ పడ్డ చంద్రబాబు

Superstar Rajinikanth | రజనీపై YCP అభిమానుల గుస్సా.. బాధ పడ్డ చంద్రబాబు

Superstar Rajinikaaanth

విధాత‌: ఎన్టీయార్ శత జయంతుత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎన్టీయార్ తో బాటు చంద్రబాబును పొగడడం ఇటు వైసిపి అభిమానులకు నచ్చలేదు. ముఖ్యంగా పార్టీ సోషల్ మీడియాకు మింగుడు పడలేదు. దీంతో వరుస పెట్టి ట్వీట్స్, మీమ్స్, పోస్ట‌ర్లు వేస్తూ రజనీ మీద విరుచుకుపడుతున్నారు.

చంద్రబాబు వల్లనే హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందిందని, ఆయన మళ్ళి ఏపీ సీఎం కావాలని రజనీ (Rajinikanth) ఆకాంక్షించారు. చంద్రబాబు తనకు ఎన్నో ఏళ్లుగా మంచి స్నేహితుడు అని, ఇంకా బాబును పాలనా దక్షుడిగా పేర్కొంటూ రజనీ చేసిన వ్యాఖ్యలు వైసిపి వాళ్లకు కోపం తెప్పించాయి. దీంతో ఇక రజనీని ఒక రాజకీయ అసమర్దుడిగా, పిరికివాడిగా.. కుటుంబం, ఆడపిల్లలను సరిగా తీర్చిదిద్దలేని వాడిగా పేర్కొంటూ కామెంట్స్ దంచి కొట్టారు.

ఇంకా ఆయన భార్య లతా గతంలో ఇచ్చిన ఓ చెక్ చెల్లకపోవడం, దానిమీద కేసు బుక్ అవడం వంటి అంశాలన్నీ తవ్వి తీసి ధూపం వేయడం మొదలు పెట్టారు. అంతే కాకుండా ఆనాడు ఎన్టీయార్ ను గద్దె దించి చంద్రబాబు అధికారం చేపట్టినప్పటి సంఘటనలో రజనీ కూడా చంద్రబాబుకు సపోర్ట్ చేసారు. అయితే ఆ నాటి ఫోటోలు తీసి మరీ వైసిపి అభిమానులు రజనీ మీద విరుచుకుపడుతున్నారు.

మహానటుడు ఎన్టీయార్ కు వెన్నుపోటు సందర్భంలో మీరు కూడా చంద్రబాబుకు సాయం చేసారు.. మళ్ళీ ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని వచ్చి ఎన్టీయార్ కు నివాళులు అర్పిస్తారు. మీరు ఊసరవెల్లి.. అంటూ చేస్తున్న కామెంట్స్ రజనీ వరకూ వెళ్ళాయో లేదో కానీ ఇటు చంద్రబాబు మాత్రం బాగా ఇబ్బంది పడ్డారు.

రజనీ తన గురించి నాలుగు మంచి మాటలు చెప్పడమే తప్పా..?? ఆయన్ను అలాగే ఆడిపోసుకుంటారా.? ఇదేనా మీ సంస్కారం… అలాంటి పెద్ద మనిషిని పట్టుకుని నోటికొచ్చినట్లు తిడతారా.. ? ముందు మీరంతా రజనీ కాంత్ కు క్షమాపణ చెప్పండి అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు… మొత్తానికి రజనీని పిలిచి ఆయన్ను తిట్టే ఛాన్స్ వైసిపి వాళ్లకు ఇచ్చినట్లు అయింది.. దాన్ని కవర్ చేసేందుకు ఇప్పుడు ఇలా పోస్ట్ పెట్టాల్సి వచ్చింది..

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular