Justice SV Bhatti | మొదటి సారి తెలంగాణ హైకోర్టు వచ్చిన జస్టిస్ ఎస్వీ భట్టి ఘనంగా సన్మానించి బొకేలు అందజేసి న్యాయమూర్తులు, న్యాయవాదులు విధాత, హైదరాబాద్ : న్యాయమూర్తులు, న్యాయవాదులు అందరూ కలిసికట్టుగా పనిచేసి న్యాయవ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్టి అన్నారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించి శుక్రవారం మొదటిసారిగా తెలంగాణ హైకోర్టుకు వచ్చిన ఆయన తెలంగాణ న్యాయమూర్తులు, న్యాయవాదులు, తెలంగాణ అడ్వకేట్స్ బార్ […]

Justice SV Bhatti |
- మొదటి సారి తెలంగాణ హైకోర్టు వచ్చిన జస్టిస్ ఎస్వీ భట్టి
- ఘనంగా సన్మానించి బొకేలు అందజేసి న్యాయమూర్తులు, న్యాయవాదులు
విధాత, హైదరాబాద్ : న్యాయమూర్తులు, న్యాయవాదులు అందరూ కలిసికట్టుగా పనిచేసి న్యాయవ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్టి అన్నారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించి శుక్రవారం మొదటిసారిగా తెలంగాణ హైకోర్టుకు వచ్చిన ఆయన తెలంగాణ న్యాయమూర్తులు, న్యాయవాదులు, తెలంగాణ అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా, మదనపల్లికి చెందిన జస్టిస్ ఎస్వీ భట్టి తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులలో న్యాయమూర్తిగా పనిచేశారు. అక్కడినుంచి కేరళ హైకోర్టులో యాక్టింగ్ సీజేగా, ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు. అక్కడినుంచి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు మేరకు సుప్రీంకోర్టుకు పదోన్నతిపై వెళ్లిన ఆయన 14-07-2023 రోజున సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు.
దీంతో మొదటిసారిగా తెలంగాణ హైకోర్టుకు వచ్చిన జస్టిస్ ఎస్వీ భట్టి తెలంగాణ హైకోర్టులోని అడ్వకేట్స్ అసోసియేషన్‌లోలో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎస్వీ భట్టి మాట్లాడుతూ.. జ్యూడిషియల్ వ్యవస్థ బతికిఉండాలంటే అందులో భాగస్వాములు అయిన ప్రతి ఒక్కరూ కూడా నిరంతరం కష్టపడుతూ న్యాయం కోసం కృషిచేయాలని కోరారు.
న్యాయవాదులు రోజుకూ 14 నుంచి 15 గంటలు కష్టపడాలని సూచించారు. పలు కేసులతో ఇబ్బందులు పడుతూ కోర్టువరకు వచ్చిన కక్షిదారులకు సత్వరమే కేసులు పరిష్కరించి న్యాయం చేస్తేనే వారికి న్యాయవ్యవస్థపై నమ్మకం కలుగుతుందన్నారు. అంతేకాకుండా పలువిషయాలపై న్యాయమూర్తులు, న్యాయవాదులులకు అవగాహన కల్పించారు. అనంతరం న్యాయమూర్తులు, న్యాయవాదులు ఆయనను ఘనంగా సన్మానించి పూలబొకేలు అందజేశారు.
