విధాత: తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టు (Jallikattu) విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జల్లికట్టుపై తమిళనాడు ప్రభుత్వం చేసిన చట్టాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. జల్లికట్టును ఆపాలంటూ వేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. 2017లో తమిళనాడు ప్రభుత్వం జల్లికట్టుపై చేసిన చట్టాన్ని సవాల్ చేస్తూ పలువురు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
దీనిపై ఇవాళ విచారణ జరిగింది. సంస్కృతిలో జల్లి కట్టు భాగమని తమిళనాడు ప్రభుత్వం చెబుతున్నది. అయితే ‘అది సంస్కృతిలో భాగమా? కాదా అనే విషయాన్ని తేల్చాల్సింది మేము కాదు అని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో జంతు హింస చట్టం జల్లికట్టుకు వర్తించదని’ పేర్కొన్న రాజ్యాంగ ధర్మాసనం.. 2014 నాటి తీర్పున సవరించింది.