విధాత‌. సినిమా: డి. రామానాయుడు బతికున్నప్పుడు సురేష్ ప్రొడక్షన్ సంస్థ ఎంతో ధైర్యంగా కొత్త దర్శకులతో చిత్రాలు చేసేది. కానీ ఆయన తరువాత సురేష్ ప్రొడక్షన్స్ బాధ్యతలు చేతబట్టిన సురేష్ బాబు మాత్రం ఒకటికి పది సార్లు ఆచితూచి మాత్రం అడుగు ముందుకు వేయడం లేదు. సురేష్‌ను ఎన్నో విధాలుగా మెప్పిస్తే గానీ ఓ సినిమా విషయంలో తుది నిర్ణయం తీసుకోవడం లేదు. ఇక విషయానికి వస్తే ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ హిట్ సిరీస్ ఫేమ్ శైలేష్ […]

విధాత‌. సినిమా: డి. రామానాయుడు బతికున్నప్పుడు సురేష్ ప్రొడక్షన్ సంస్థ ఎంతో ధైర్యంగా కొత్త దర్శకులతో చిత్రాలు చేసేది. కానీ ఆయన తరువాత సురేష్ ప్రొడక్షన్స్ బాధ్యతలు చేతబట్టిన సురేష్ బాబు మాత్రం ఒకటికి పది సార్లు ఆచితూచి మాత్రం అడుగు ముందుకు వేయడం లేదు. సురేష్‌ను ఎన్నో విధాలుగా మెప్పిస్తే గానీ ఓ సినిమా విషయంలో తుది నిర్ణయం తీసుకోవడం లేదు.

ఇక విషయానికి వస్తే ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ హిట్ సిరీస్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో ఒక సినిమా స్టార్ట్ చేశారు. నిహారిక ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యానర్ వెంక‌ట్ బోయిన‌ప‌ల్లి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఇందులో సురేష్ ప్రొడక్ష‌న్స్ కూడా భాగ‌స్వామని తెలుస్తోంది. ఈ మూవీకి సైంధ‌వ్ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. చాలాకాలం తరువాత పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా వెంకటేష్ కనిపించనున్నారు.

ఘ‌ర్ష‌ణ సినిమా తరువాత వెంకటేష్ ని ఈ సినిమాలో సీరియస్ పోలీస్ పాత్రలో చూడ‌నున్నాం. వెంకీని అలాంటి పాత్రలో చూడాలని చాలామంది కోరుకుంటున్నారు. మొత్తానికి చాలా కాలం తరువాత సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో వెంకటేష్ క‌నిపించ‌నున్నారు. ప్రోమో కూడా రిలీజ్ అయింది. పూజా కార్యక్రమాలు జరిగాయి. వెంకటేష్‌కి ప్రతి కథానాయకుడిగా బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్ధికి నటించబోతున్నారు.

తెలుగులో ఇదే ఆయనకు మొదటి సినిమా. అయితే దీనికంటే ముందుగానే సురేష్ ప్రొడక్షన్స్ లో జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీతో వెంకటేష్ సినిమా చేయాల్సి ఉంది. అలాగే పెళ్లిచూపులు ఫేమ్ తరుణ్ భాస్కర్ తో కూడా ఓ చిత్రమనుకున్నారు. పెళ్లిచూపులు హిట్ట‌యిన తర్వాత తరుణ్ భాస్కర్‌కు ఓ ఛాన్స్ ఇస్తున్నట్టు ప్రకటన కూడా వచ్చింది.

కానీ ఆయ‌న సురేష్‌బాబుతో చేసిన ఈ న‌గ‌రానికి ఏమైంది చిత్రం క‌మ‌ర్షియ‌ల్‌గా స‌క్సెస్ కాక‌పోవ‌డంతో త‌రుణ్ భాస్క‌ర్‌ని లిస్ట్ నుంచి తీసేశారు. జాతిరత్నాలు అనుదీప్‌తో సురేష్ బాబు తీసిన ప్రిన్స్ చిత్రం స‌రిగ్గా ఆడ‌క‌ పోవ‌డంతో ఈసారి వంతు త‌రుణ్ భాస్క‌ర్ త‌ర‌హాలో అనుదీప్‌కి ఎదురైంది.

దీంతో ఈ ఇద్ద‌రు ద‌ర్శ‌కుల‌ను సురేష్ బాబు ప‌క్క‌న పెట్టేశారు. వారి స్క్రిప్టు వెర్షన్లు సురేష్ బాబుకి నచ్చ లేదని టాక్. చాలా వెర్షన్స్ విన్నా కూడా అవేవి సురేష్ బాబును సంతృప్తి పరచలేదని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అనుదీపష్‌తో పాటు తరుణ్ భాస్కర్ ప్రాజెక్టును కూడా సురేష్ బాబు పక్కన పెట్టినట్టు తెలుస్తోంది.

దీంతో అనుదీప్ తన నెక్స్ట్‌ సినిమా కోసం సితార ఎంటర్టైన్మెంట్స్‌తో కలిసి పని చేయడానికి సిద్ధమైనట్టు సమాచారం. సితార చిత్రం అంటే మీడియం రేంజ్ హీరోతోనే అవకాశం ఉంటుంది. ఇదంతా కేవలం ప్రిన్స్ సినిమా ఫ్లాప్ కారణంగా ఏర్పడిన పరిస్థితి. ఆ ఫెయిల్యూర్స్‌ త‌రుణ్ బాస్కర్, అనుదీప్ కె.వి.లు వెంకటేష్‌లతో సినిమా ఛాన్స్ పోగొట్టుకునే దాకా ప‌రిస్థితి వెళ్లింద‌ని స‌మాచారం.

Updated On 2 Feb 2023 12:11 PM GMT
Somu

Somu

Next Story