Suresh babu | చంద్రబాబు అరెస్ట్ పై సురేష్ బాబు తెలివైన సమాధానం !! విధాత: చంద్రబాబు అరెస్ట్ మీద సినిమా రంగం పెద్దగా స్పందించలేదు. రాఘవేంద్ర రావు, అశ్వనీదత్ మురళీమోహన్ వంటి ఇద్దరూ ముగ్గురూ మినహా ఈ అంశాన్ని వినీ విననట్లే ఊరుకున్నారు. చంద్రబాబును సమర్ధిస్తూ ప్రకటన చేస్తే ఇటు జగన్ కు కోపం వస్తుంది. ఆ తరువాత కొత్త సినిమాల టికెట్ ధరలు పెంపు విషయమై జగన్ మళ్ళా కోపానికి వస్తె లేనిపోని తలనొప్పి. […]

Suresh babu |
- చంద్రబాబు అరెస్ట్ పై సురేష్ బాబు తెలివైన సమాధానం !!
విధాత: చంద్రబాబు అరెస్ట్ మీద సినిమా రంగం పెద్దగా స్పందించలేదు. రాఘవేంద్ర రావు, అశ్వనీదత్ మురళీమోహన్ వంటి ఇద్దరూ ముగ్గురూ మినహా ఈ అంశాన్ని వినీ విననట్లే ఊరుకున్నారు. చంద్రబాబును సమర్ధిస్తూ ప్రకటన చేస్తే ఇటు జగన్ కు కోపం వస్తుంది. ఆ తరువాత కొత్త సినిమాల టికెట్ ధరలు పెంపు విషయమై జగన్ మళ్ళా కోపానికి వస్తె లేనిపోని తలనొప్పి. హీరోలు..నిర్మాతలు సైతం జగన్ ఇంటికి వచ్చి బతిమాలాల్సి ఉంటుంది. అందుకే ఎవరూ కిక్కురుమనలేదు.
ఇక ప్రొఫెషనల్ నిర్మాత సురేష్ బాబు సైతం అటు చంద్రబాబు వైపు..ఇటు జగన్ వైపు కాకుండా డిప్లొమాటిక్ గా స్పందించి తప్పుకున్నారు. ఆయన "సప్త సాగరాలు దాటి" అనే సినిమా ప్రచార కార్యక్రమానికి సంబంధించి విలేకరుల సమావేశంలో ఆయన్ను విలేకరులు కదిలించారు.
చంద్రబాబు అరెస్ట్ పై స్పందించాలని కోరగా ఆయన . తెలుగు సినీ పరిశ్రమ రాజకీయాలకు, మతపరమైన అంశాలకు ఎప్పుడూ దూరంగానే ఉందని స్పష్టం చేశారు. అందుకే సున్నితమైన విషయాలపై చిత్ర పరిశ్రమ నుంచి స్పందన ఉండదని.. అందులో భాగంగానే తెలంగాణ, ఆంధ్ర విషయంలోనూ సినీ పరిశ్రమ స్పందించలేదని సమాధానం ఇచ్చారు. స్పందించాలంటే రోజూ రాజకీయంగా ఏదో ఒక విషయం ఉంటూనే ఉంటుంది.
అయితే అది తమ బాధ్యత కాదని అన్నారు. "పరిశ్రమ ఎప్పుడూ రాజకీయంగా ప్రకటనలు ఇవ్వటం మంచిది కాదు. ఎందుకంటే మేము రాజకీయ నాయకులం కాదు, మేము మీడియా వాళ్ళం కాదు, మేము సినిమాలు నిర్మించడానికి వచ్చాం, సినిమాలు తీస్తాం. నన్ను అడిగితే చిత్ర పరిశ్రమ రాజకీయాల ప్రకటనలు ఇవ్వటం మంచిది కాదని అనుకుంటున్నాను" అని అన్నారు.
ఇదే సమయంలో "మా నాన్నగారు (రామానాయుడు) తెలుగుదేశం మెంబెర్, నేను కూడా పార్టీకి పని చేసాను. అది మా వ్యక్తిగతం. కానీ పరిశ్రమకి వచ్చినప్పుడు నేను ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా పరిశ్రమకి చెందిన వాళ్ళం" అని చెప్పారు… "చాలా మంది ముఖ్యమంత్రులు పరిశ్రమకి చాలా చేశారు.
చెన్నారెడ్డి గారు అయితే చాలా హెల్ప్ చేశారు, తరువాత ఎన్టీఆర్ గారు చేశారు. చంద్రబాబు గారు కూడా చిత్ర పరిశ్రమకి చాలానే చేశారు. ఈ సమయంలో చిత్ర పరిశ్రమ స్పందించటం లేదన్నది కరెక్టు కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయిడు అరెస్టు అనేది చాలా సున్నితమైన ఇష్యూ. ఆంధ్రా, తెలంగాణ గొడవలప్పుడు కూడా పరిశ్రమ నుండి ఎటువంటి స్పందన రాలేదు ఇదీ అలాంటిదే" అన్నారు.
