Suryapet
- మంత్రి జగదీష్ రెడ్డి అభ్యర్ధనకు ముఖ్యమంత్రి కేసీఅర్ నిర్ణయం..
- తక్షణ నియామకాలకు ఆదేశాలు
విధాత: సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలకు కొత్తగా 45 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఏక కాలంలో ఇంత మందిని నియమించడం ద్వారా వైద్య రంగంలో నూతనాధ్యాయం సృష్టించినట్లైంది.
జనరల్ మెడిసిన్(5) జనరల్ సర్జన్(7) ఆర్థోపెడిక్(3) పిడియాట్రిక్(5)ఈ యన్ టి(1) ఓ. బి. జీ,(8) అనస్థీషియా(7) అనాటమీ(1) పథాలజీ, (2)మైక్రో బయలజీ(1)ఫోరెన్సిక్ మెడిసిన్(1) రేడియో డయాగ్నిస్ (3) ఆప్తాల్ (1) కమ్యూనిటీ మెడిసిన్ (1) విభాగాలకు కలిపి మొత్తం 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి, స్థానిక శాససభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభ్యర్ధన మేరకు ముఖ్యమంత్రి కేసీఅర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పేద ప్రజలకు వైద్య సేవల విస్తరణకు ఈ నియామకాలు దోహదపడనున్నాయి
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి జగదీష్ రెడ్డి ధన్యవాదాలు
సూర్యాపేట మెడికల్ కళాశాలకు 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా సహచర వైద్య ఆరోగ్య మరియు ఆర్ధిక శాఖామంత్రి హరీష్ రావు కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యమంత్రిగా కేసీఅర్ అధికారంలోకి వచ్చాక విద్య, వైద్య రంగంలో తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులకు ఈ నియామకాలు అద్దం పడ్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
మారుమూల ప్రాంతాలకు వైద్య సేవల విస్తరణకు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల ప్రక్రియ ఖచ్చితంగా దోహద పడుతుందని ఆయన అన్నారు. పేదలకు ఆధునిక వైద్యం అందుబాటులోకీ తేవడమే కాకుండా అందుకు అనుగుణంగా నియామకాలను చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఅర్ సామాన్యుడిపై ఉన్న ప్రేమను మరోమారు చాటుకున్నారని మంత్రి జగదీష్ రెడ్డి కొనియాడారు.