విధాత: చత్తీస్ ఘడ్ రాష్ట్ర రాజధాని రాయపూర్‌లో శుక్రవారం ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీకి టి.కాంగ్రెస్ సీనియర్లు, ఏఐసీసీ సభ్యులు హాజరయ్యారు. రాష్ట్రం నుంచి 47మందికి ఏఐసీసీ సభ్యుల హోదాలో ప్లీనరీలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా ఎంపీలు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదరం రాజనర్సింహ, కే.జానారెడ్డి, గీతారెడ్డి, చిన్నారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, అంజన్ యాదవ్, విహెచ్, మధు యాష్కీ, జగ్గారెడ్డి, కోదండ రెడ్డి వంటి సీనియర్లు అంతా ప్లీనరీకి చేరుకున్నారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే వివిధ రాష్ట్రాల్లో పార్టీ గెలుపుకు అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు 2024 సార్వత్రిక ఎన్నికలలో విజయం లక్ష్యంగా రూపొందించాల్సిన ప్రణాళికలపై ప్లీనరీలో చర్చించనున్నారు.