విధాత: టీ20 ప్రపంచకప్‌లో కీలకమైన సెమీస్‌లో మొదట టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ భారత్‌కు బ్యాటింగ్‌ అప్పగించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్‌ 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ జట్టు ముందు 169 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ ఓపెనర్లు అలెక్స్‌ హేల్స్‌, జట్టు కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ దూకుడు ఆడి హాఫ్‌ సెంచరీలతో చెలరేగిపోయారు. బట్లర్‌ 80, హేల్స్‌ 86 పరుగులతో నాటౌట్‌గా నిలిచి వికెట్‌ […]

విధాత: టీ20 ప్రపంచకప్‌లో కీలకమైన సెమీస్‌లో మొదట టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ భారత్‌కు బ్యాటింగ్‌ అప్పగించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్‌ 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ జట్టు ముందు 169 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ ఓపెనర్లు అలెక్స్‌ హేల్స్‌, జట్టు కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ దూకుడు ఆడి హాఫ్‌ సెంచరీలతో చెలరేగిపోయారు. బట్లర్‌ 80, హేల్స్‌ 86 పరుగులతో నాటౌట్‌గా నిలిచి వికెట్‌ నష్టపోకుండా ఇంగ్లాండ్‌ జట్టును అలవోకగా విజయతీరాలకు చేర్చి ఇండియాను ఇంటికి పంపారు. ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ పాకిస్థాన్‌తో తలపడనున్నది.

Updated On 10 Nov 2022 11:12 AM GMT
krs

krs

Next Story