విధాత, అడిలైడ్ ఓవల్: టీమిండియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న అమీతుమీ సెమీస్‌లో హార్దిక్ పాండ్యా ఫోర్లు, సిక్స్‌ల‌తో విజృంబించాడు. 33 బంతుల్లో 63 పరుగులు చేసి 5 సిక్స్‌లు, 4 ఫోర్లతో దుమ్మురేపాడు. టీమిండియా కష్టాల్లో ఉన్న సమయంలో మంచి స్కోర్ చేసి జట్టుకు అండగా నిలిచాడు. దీంతో.. టీమిండియా 169 పరుగుల టార్గెట్‌ను ఇంగ్లండ్‌కు నిర్దేశించగలిగింది. విరాట్ కోహ్లీ కూడా త‌న మీద పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌కుండా హాఫ్ సెంచరీ చేసి పరువు నిల‌బెట్టారు. […]

విధాత, అడిలైడ్ ఓవల్: టీమిండియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న అమీతుమీ సెమీస్‌లో హార్దిక్ పాండ్యా ఫోర్లు, సిక్స్‌ల‌తో విజృంబించాడు. 33 బంతుల్లో 63 పరుగులు చేసి 5 సిక్స్‌లు, 4 ఫోర్లతో దుమ్మురేపాడు. టీమిండియా కష్టాల్లో ఉన్న సమయంలో మంచి స్కోర్ చేసి జట్టుకు అండగా నిలిచాడు. దీంతో.. టీమిండియా 169 పరుగుల టార్గెట్‌ను ఇంగ్లండ్‌కు నిర్దేశించగలిగింది.

విరాట్ కోహ్లీ కూడా త‌న మీద పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌కుండా హాఫ్ సెంచరీ చేసి పరువు నిల‌బెట్టారు. మొత్తంగా టీమిండియా 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసి ఇంగ్లండ్ ముందు 169 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది.

ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఈ మధ్య మంచి ఫామ్‌లోకి వచ్చిన ఓపెనర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో 5 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేసి క్రిస్ ఓక్స్ బౌలింగ్‌లో బట్లర్‌కు కీపర్ క్యాచ్‌గా చిక్కి వెనుదిరిగాడు.

ఆ తర్వాత క్రీజులోకొచ్చిన విరాట్ కోహ్లీ 40 బంతుల్లో 50 కొట్టి హాఫ్ సెంచరీతో రాణించాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 27 పరుగులుతో ఫర్వాలేదనిపించాడు. సూర్యకుమార్ యాదవ్ సిక్స్‌, ఫోర్‌తో అదరగొట్టినప్పటికీ ఆ తర్వాత ఓవర్‌లోనే షాట్‌కు యత్నించి అడిల్ రషీద్ బౌలింగ్‌లో క్యాచ్‌గా చిక్కి 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వెనుదిరిగాడు.

Updated On 10 Nov 2022 10:20 AM GMT
krs

krs

Next Story