విధాత: ఎంతైనా మన దేశం ఇంకా వెనుకబడి ఉందనుకుంటాం కానీ కొన్ని విషయాల్లో మాత్రం మన దేశం.. విదేశీ సంస్కృతీ సంప్రదాయాలను మించిపోతోంది. అమెరికా, లండన్ వంటి దేశాలలో అయితే పబ్లిక్‌గానే రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. అందరూ చూస్తుండగానే లిప్ లాక్ ఇస్తుంటారు. ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా కనిపిస్తూ ఉంటారు.
అంతెందుకు ఒకరితో ఒకరు ఓపెన్‌గా బహిరంగంగానే శృంగారంలో నిమగ్నమైపోతుంటారు. ఇవన్నీ ఇప్పుడు చిన్నగా మన బాలీవుడ్ స్టార్స్ పుణ్యమా అని మన దేశానికి దిగుమతి అవుతున్నాయి. దిగుమతి అవుతూ కాదు ఇప్పటికే ఆల్రెడీ దిగుమతి అయిపోయాయి. ఈ విషయాలలో భారత్.. ఎన్నో దేశాలకంటే ఓ అడుగు ముందే ఉందని చెప్పుకోవాలి. దీనికి బెస్ట్ ఉదాహరణ మన బాలీవుడ్ బ్యూటీ తమన్నా భాటియా.
ఇటీవల జరిగిన న్యూ ఇయర్ పార్టీలో ఈమె రెచ్చిపోయింది. గోవాలో జరిగిన ఈ వేడుకలో పాల్గొన్న ఆమె తన ప్రియుడు విజయ్ వర్మతో కలిసి ఎంజాయ్ చేస్తూ తెగ హల్చల్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఇప్పటివరకు గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న వీరి వ్యవహారం ఇప్పుడు లీక్ అవ్వడంతో ఇక అధికారికంగా వారు ఏమైనా ప్రకటిస్తారా? అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ వీడియో చూసి కొందరు క్రేజీ కామెంట్ చేస్తుంటే, మరికొందరు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
2005లో బాలీవుడ్ చిత్రం ద్వారా తమన్నా భాటియా చిత్ర పరిశ్రమలోకి ఎంటర్ అయ్యింది. తర్వాత దక్షిణాది సినిమాలలో తెలుగింటి ఆడపడుచుగా పలు పాత్రలు చేసింది. మోడరన్ పాత్రలే కాదు కాస్త సాంప్రదాయ పాత్రలను కూడా చేసి.. ఆహా తమన్నా చాలా మంచిది.. పద్దతిగా నటిస్తూ ఉంది అనే పేరు తెచ్చుకుంది.
Tamannaah Bhatia and Vijay Varma KISS pic.twitter.com/8c7ADDMEzE
— bunny (@bunnyAmnansh) January 2, 2023
మరలా ఇప్పుడు ఈమె దక్షిణాది సినిమాలను వదులుకొని బాలీవుడ్‌లోకి వెళ్లి అక్కడ వరుస సినిమాలు చేస్తోంది. ఆమె ప్రియుడు విజయ్ వర్మ 2012లో చిట్టగ్యాంగ్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ఇతను మన నేచురల్ స్టార్ నాని నటించిన ఎంసీఏ చిత్రంలో విలన్‌గా కూడా నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితం అయ్యాడు.
నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన ఓ వెబ్ సిరీస్ కోసం తమన్నా, విజయ్ వర్మ ఇద్దరూ కలిసి పనిచేశారు. అక్కడే వారికి పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారి తీసింది అని బాలీవుడ్ మీడియా చెబుతోంది. మరి ఈ రిలేషన్ షిప్ పెళ్లి వరకు వెళ్తుందా లేక మూణ్ణాల ముచ్చట అవుతుందా..? అనేది వేచి చూడాలి. మరో విషయం ఏమిటంటే.. విజయ్ వర్మ హైదరాబాద్‌కు చెందినవాడు కావడం విశేషం.
View this post on Instagram