Tamannah | మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల తెగ వార్తలలో నిలుస్తుంది. 18 ఏళ్లుగా ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న ఈ ముద్దుగుమ్మ గతంలో ఎప్పుడు అందాలు ఆరబోసింది లేదు. కాని ఇటీవల మాత్రం ఘాటు అందాలతో రచ్చ చేస్తుంది. లిప్ లాక్ కిస్‌లకి సైతం సై అంటుంది. ఇక ఇటీవల విజయ్ వర్మతో ప్రస్తుతం డేటింగ్‌లో ఉన్న తమన్నా ఆయనతో కలిసి షికార్లకి కూడా వెళుతుంది. కొద్ది రోజుల క్రితం తన ప్రేమపై ఓపెన్ అయిన మిల్కీ […]

Tamannah |
మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల తెగ వార్తలలో నిలుస్తుంది. 18 ఏళ్లుగా ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న ఈ ముద్దుగుమ్మ గతంలో ఎప్పుడు అందాలు ఆరబోసింది లేదు. కాని ఇటీవల మాత్రం ఘాటు అందాలతో రచ్చ చేస్తుంది. లిప్ లాక్ కిస్‌లకి సైతం సై అంటుంది. ఇక ఇటీవల విజయ్ వర్మతో ప్రస్తుతం డేటింగ్‌లో ఉన్న తమన్నా ఆయనతో కలిసి షికార్లకి కూడా వెళుతుంది.
కొద్ది రోజుల క్రితం తన ప్రేమపై ఓపెన్ అయిన మిల్కీ బ్యూటీ.. లస్ట్ స్టోరీస్ 2 సెట్స్ లో మా మధ్య ప్రేమ చిగురించింది అని చెప్పుకొచ్చింది. అతను నాకు అన్ని విధాలుగా రక్షణగా ఉంటాడనే నమ్మకం ఏర్పడడంతో ఆయనని ప్రేమించాను అని పేర్కొంది. ఇటీవల తమన్నా, విజయ్ వర్మ జంటగా కనిపిస్తుండగా, వీరిద్దరి వివాహం త్వరలోనే జరగనుందని అందరు భావిస్తున్నారు.
ఈ క్రమంలో తమన్నా పెద్ద షాక్ ఇచ్చింది. తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని , వివాహ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం పోయిందని పేర్కొంది. ఒకప్పుడు వివాహం చేసుకోవాలని అనుకున్నాను కానీ ఇప్పుడు నా మానసిక స్థితి పూర్తిగా మారింది. ప్రస్తుతం నటనపై ఎక్కువగా దృష్టి పెట్టా, షూటింగ్, సెట్స్ నాకు నచ్చిన ప్రదేశాలు. నేను ఇప్పుడు నటనపైనే పూర్తి దృష్టి పెట్టాలని అనుకుంటున్నానని తమన్నా పేర్కొంది.
దీంతో పెళ్లి ఆలోచన లేదన్న తమన్నా.. విజయ్ వర్మని ఎందుకు ప్రేమిస్తుందనే అనుమానాలు అందరిలో వ్యక్తం అవుతున్నాయి. అయితే పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య ముందే ఒప్పందం జరిగి ఉంటుందని, ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవించుకుంటూ కలిసి జీవించాలని వారు అనుకొని ఉండి ఉండవచ్చు అని కొందరు నెటిజన్స్ భావిస్తున్నారు.
ఇటీవల ఈ జంట మాల్దీవులలో ప్రత్యక్షమయ్యారు. మాల్దీవుల టూర్ ముగిసాక ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగగా, మొదట తమన్నా నడుచుకుంటూ వచ్చింది. ఆమెను విజయ్ వర్మ ఎక్కడని మీడియా ప్రశ్నించగా, తమన్నా ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వెళ్లింది. ఇక ఆ తర్వాత విజయ్ వచ్చాడు. ఆ సమయంలో ఒక రిపోర్టర్.. 'మాల్దీవ్స్ లో బాగా ఎంజాయ్ చేశారా? అని అడిగారు. ఆ ఇబ్బందికర ప్రశ్నకు విజయ్ వర్మ చాలా ఇబ్బందిగా ఫీలై అలా మాట్లాడడం సరికాదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
