Viral Video | త‌మ‌కు న‌చ్చిన వృత్తి నుంచి కానీ, త‌మ‌కు న‌చ్చిన వ్య‌క్తుల నుంచి దూరం కావాల్సి వ‌చ్చిన‌ప్పుడు బ‌రువైన హృద‌యంతో వీడ్కోలు ప‌లుకుతుంటాం.. అస‌లు ఆ వృత్తిని కానీ, ఆ వ్య‌క్తిని విడిచి వెళ్లేందుకు మ‌న‌సు ఒప్ప‌దు. కానీ ఉబికి వ‌స్తున్న క‌న్నీటిని దిగ‌మింగుకుంటూ బ‌య‌ల్దేరుతాం. అయితే వృత్తి ప‌ట్ల నిబ‌ద్ద‌త ఉన్న ఓ ఆర్టీసీ డ్రైవ‌ర్ కూడా భార‌మైన హృద‌యంతో త‌న వృత్తికి వీడ్కోలు ప‌లికారు. త‌మిళ‌నాడు ఆర్టీసీలో బ‌స్సు డ్రైవ‌ర్‌గా ప‌ని […]

Viral Video | త‌మ‌కు న‌చ్చిన వృత్తి నుంచి కానీ, త‌మ‌కు న‌చ్చిన వ్య‌క్తుల నుంచి దూరం కావాల్సి వ‌చ్చిన‌ప్పుడు బ‌రువైన హృద‌యంతో వీడ్కోలు ప‌లుకుతుంటాం.. అస‌లు ఆ వృత్తిని కానీ, ఆ వ్య‌క్తిని విడిచి వెళ్లేందుకు మ‌న‌సు ఒప్ప‌దు. కానీ ఉబికి వ‌స్తున్న క‌న్నీటిని దిగ‌మింగుకుంటూ బ‌య‌ల్దేరుతాం. అయితే వృత్తి ప‌ట్ల నిబ‌ద్ద‌త ఉన్న ఓ ఆర్టీసీ డ్రైవ‌ర్ కూడా భార‌మైన హృద‌యంతో త‌న వృత్తికి వీడ్కోలు ప‌లికారు.

త‌మిళ‌నాడు ఆర్టీసీలో బ‌స్సు డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తున్న ఓ వ్య‌క్తికి ప‌ద‌వీ విర‌మ‌ణ పొందే స‌మ‌యం వ‌చ్చింది. కానీ రిటైర్ అయ్యేందుకు మ‌న‌సు ఒప్ప‌లేదు. త‌న 30 ఏండ్ల డ్రైవ‌ర్ జీవితాన్ని చివ‌రి రోజు నెమ‌రేసుకున్నాడు.

ప‌ద‌వీ విర‌మ‌ణ రోజు.. త‌న‌కు బ‌తుకుదెరువు ఇచ్చిన ఆర్టీసీ బ‌స్సు స్టీరింగ్‌కు ముద్దిచ్చాడు. అక్క‌డితో ఆగిపోలేదు. బ‌స్సు మెట్ల‌కు దండం పెట్టాడు. ఉబికి వ‌స్తున్న క‌న్నీటిని దిగ‌మింగుకుంటూ ఆ బ‌స్సును కౌగిలించుకున్నాడు. అనంత‌రం త‌న క‌న్నీటి ధార‌ను తుడుచుకుంటూ త‌న వృత్తికి వీడ్కోలు ప‌లికాడు ఆ బ‌స్సు డ్రైవ‌ర్.

ఈ దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. బస్సు డ్రైవ‌ర్‌కు త‌న వృత్తిప‌ట్ల ఉన్న చిత్త‌శుద్ధిని ప్ర‌శంసించారు. ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన ఆ డ్రైవ‌ర్ ఆయురారోగ్యాల‌తో నిండునూరేళ్లు జీవించాల‌ని కొంద‌రు ప్రార్థించారు.

వృత్తిని ప్రేమించ‌డం అంటే ఏంటో ఈ వీడియోను చూస్తే తెలుస్తుంద‌ని మ‌రికొంద‌రు పేర్కొన్నారు. మీలాంటి వారు ఎంద‌రికో స్ఫూర్తి అంటూ నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

Updated On 5 Jun 2023 3:45 PM GMT
subbareddy

subbareddy

Next Story