విధాత: తమిళనాడు (Tamil Nadu) నుంచి వచ్చిన వీడియో ఒకటి ఇన్‌స్టాలో వైరల్‌గా మారింది, ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను బండి వెనక కూర్చో బెట్టుకుని రోడ్డుపై ప్రయాణిస్తున్న వీడియో అది. దానికి స్పోర్ట్స్ హెల్మెట్ కూడా పెట్టడంతో అచ్చం మనిషి కూర్చున్నట్టే కనిపిస్తోంది.
Rule is rule..😜#WhatsApp #instagramdown #TamilNadu pic.twitter.com/g47mB5mEfY
— Mohammed Nayeem (@PMN2463) May 23, 2023
అటో కాలు ఇటో కాలు వేసుకుని ముందు కాళ్లతో బండి నడుపుతున్న తన యజమాని భుజాలను పట్టుకుని బుద్ధిగా కూర్చున్న ఆ కుక్కను చూస్తుంటే భలే అనిపిస్తోందని యూజర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరు.. మనం ప్రేమించే వ్యక్తుల పట్ల ఇంత జాగ్రత్త చాలా అవసరమని కుక్కకు హెల్మెట్ కూడా పెట్టిన ఆ యువకుడిని పొడుగుతున్నారు.