విధాత: అమెరికాలోని టెక్సాస్ వాలర్ కౌంటీలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తానా బోర్డు డైరెక్టర్ డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ భార్య, ఇద్దరు కుమార్తెలు చనిపోయారు. కృష్ణా జిల్లా కురుమద్దాలికి చెందిన నాగేంద్ర శ్రీనివాస్ ఉన్నత విద్యను అభ్యసించేందుకు 1995లో అమెరికా వెళ్లారు. తర్వాత పీడియాట్రిక్ కార్డియోవాస్క్యులర్ అనస్థీషియాలజిస్ట్ గా పనిచేస్తూ హ్యూస్టన్ లో స్థిరపడ్డారు. 2017 నుంచి తానా బోర్డులో పనిచేస్తున్నారు. అయితే.. శ్రీనివాస్ భార్య వాణి ఆదివారం కాలేజీ నుంచి కుమార్తెలను […]

విధాత: అమెరికాలోని టెక్సాస్ వాలర్ కౌంటీలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తానా బోర్డు డైరెక్టర్ డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ భార్య, ఇద్దరు కుమార్తెలు చనిపోయారు. కృష్ణా జిల్లా కురుమద్దాలికి చెందిన నాగేంద్ర శ్రీనివాస్ ఉన్నత విద్యను అభ్యసించేందుకు 1995లో అమెరికా వెళ్లారు. తర్వాత పీడియాట్రిక్ కార్డియోవాస్క్యులర్ అనస్థీషియాలజిస్ట్ గా పనిచేస్తూ హ్యూస్టన్ లో స్థిరపడ్డారు. 2017 నుంచి తానా బోర్డులో పనిచేస్తున్నారు.

అయితే.. శ్రీనివాస్ భార్య వాణి ఆదివారం కాలేజీ నుంచి కుమార్తెలను తీసుకొచ్చేందుకు కారులో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో టెక్సాస్ వాలర్ కౌంటీలో వారు ప్రయాణిస్తున్న కారును ఓ వ్యాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఒకరు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. వాణి ఐటీ ఉద్యోగి కాగా, పెద్ద కుమార్తె వైద్య విద్యను అభ్యసిస్తోంది. రెండో అమ్మాయి 11వ తరగతి చదువుతోంది.ప్రమాదంలో భార్య, ఇద్దరు కుమార్తెలను కోల్పోయిన శ్రీనివాస్ షాక్‌లోకి వెళ్లిపోయారు. విషయం తెలిసిన తానా సభ్యులు, సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
- apnewslatestnewslatestupdatestanaandhrapradeshartifactscircular economyentrepreneur awardflorence pugh olivia wildeharry styles olivia wildelife of pablomanas robinmanas robin&039;s productionnaren kodali tanaolivia wildeolivia wilde harry stylesrunning for tana board of directortana athi water services boardtera aana tera jaanathe finnish entrepreneur of the year awardtitanic artifactsUpdatesworking while black: a woman&039;s guide to stop being the best kept secret
