Rajasthan | ఓ మంత్రగాడు ఘోరానికి పాల్ప‌డ్డాడు. త‌న ముందే ఆ ప‌ని చేయాల‌ని ఓ జంట‌ను కోరాడు. మంత్ర‌గాడు చెప్పిన‌ట్టే ఆ జంట న‌గ్నంగా ఉండి ఆ ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. అంత‌లోనే ఆ జంట జ‌న‌నాంగాల‌పై మంత్ర‌గాడు ఫెవికిక్ పోశాడు. దీంతో ఇద్ద‌రి శ‌రీరాలు అతుక్కుపోయాయి. ప్ర‌యివేటు భాగాల‌కు తీవ్ర గాయాలు కావ‌డంతో అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయారు. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో న‌వంబ‌ర్ 15న చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. కెలాభ‌వాడి […]

Rajasthan | ఓ మంత్రగాడు ఘోరానికి పాల్ప‌డ్డాడు. త‌న ముందే ఆ ప‌ని చేయాల‌ని ఓ జంట‌ను కోరాడు. మంత్ర‌గాడు చెప్పిన‌ట్టే ఆ జంట న‌గ్నంగా ఉండి ఆ ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. అంత‌లోనే ఆ జంట జ‌న‌నాంగాల‌పై మంత్ర‌గాడు ఫెవికిక్ పోశాడు. దీంతో ఇద్ద‌రి శ‌రీరాలు అతుక్కుపోయాయి. ప్ర‌యివేటు భాగాల‌కు తీవ్ర గాయాలు కావ‌డంతో అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయారు. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో న‌వంబ‌ర్ 15న చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. కెలాభ‌వాడి ఏరియాకు చెందిన రాహుల్ మీనా(30) టీచ‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. అయితే రాహుల్ కుటుంబ స‌భ్యులు స్థానికంగా ఉన్న మంత్ర‌గాడు భ‌లేష్ కుమార్ వ‌ద్ద‌కు వెళ్లి.. పూజ‌లు చేయించుకునేవారు. ఇదే మంత్ర‌గాడి వ‌ద్ద‌కు సోనూ కున్వార్(28) అనే అమ్మాయి కుటుంబ స‌భ్యులు కూడా వ‌చ్చేవారు. ఈ క్ర‌మంలో రాహుల్, సోనూకు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఈ ప‌రిచ‌యం కాస్త వివాహేత‌ర సంబంధానికి దారి తీసింది. అప్ప‌టికే రాహుల్, సోనూకు వేర్వేరు వ్య‌క్తుల‌తో పెళ్లిళ్లు జ‌రిగాయి.
అయితే తాంత్రికుడు కుమార్‌తో సోనూకు మంచి ప‌రిచ‌యాలు ఉన్నాయి. ఇక రాహుల్, సోనూ వివాహేత‌ర సంబంధం గురించి తాంత్రికుడికి తెలిసింది.

ఇంకేముంది.. రాహుల్, సోనూ వివాహేత‌ర సంబంధం గురించి రాహుల్ భార్య‌కు తాంత్రికుడు చెప్పాడు. దీంతో రాహుల్, ఆయ‌న భార్య‌కు మ‌ధ్య గొడ‌వ‌లు అధిక‌మ‌య్యాయి. అయితే ఈ గొడ‌వ‌ల‌కు కార‌ణం మంత్ర‌గాడే అని రాహుల్ నిర్ణ‌యించుకున్నాడు. ఇక తాంత్రికుడి వ‌ద్ద‌కు వెళ్లి.. మా జోలికి వ‌స్తే వేధింపుల కేసు పెడుతాన‌ని బెదిరించాడు రాహుల్.

అప్ర‌మ‌త్త‌మైన మంత్ర‌గాడు త‌న ప‌రువు పోతుందేమోన‌ని భావించాడు. త‌న‌కు సోనూతో ఉన్న రిలేష‌న్ షిప్ కూడా బ‌య‌ట ప‌డే అవ‌కాశం ఉంద‌ని అనుమానించాడు. దీంతో రాహుల్, సోనూను చంపాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఈ క్ర‌మంలో రాహుల్, సోనూను న‌వంబ‌ర్ 15వ తేదీన నిర్మానుష్య ప్రాంతానికి పిలిపించాడు మంత్ర‌గాడు. మీ స‌మ‌స్య‌లు తొల‌గిపోవాలంటే త‌న ముందు న‌గ్నంగా క‌లుసుకోవాల‌ని చెప్పాడు. మంత్ర‌గాడి మాట‌లు న‌మ్మిన ఆ జంట‌.. అత‌ను చెప్పిన‌ట్లు కానిచ్చారు.

50 ట్యూబ్‌ల ఫెవికిక్‌ను జ‌న‌నాంగాల‌పై పోశాడు..

ఇక రాహుల్, సోనూ ఆ చ‌ర్య‌లో నిమ‌గ్నం కాగా, సైలెంట్‌గా వారి జ‌న‌నాంగాల‌పై తాంత్రికుడు ఫెవికిక్ పోసేశాడు. దీంతో ప్ర‌యివేటు భాగాలు పూర్తిగా కాలిపోయాయి. అంతేకాదు.. వారిద్ద‌రూ ఒక‌రి నుంచి ఒక‌రు దూరం అయ్యే క్ర‌మంలో రాహుల్ ప్ర‌యివేటు భాగం ఆమె శ‌రీరానికే అతుక్కుపోయింది. దీంతో తీవ్ర ర‌క్త‌స్రావంతో ఇరువురు ప్రాణాలు విడిచారు. అనంత‌రం అక్క‌డ్నుంచి భ‌లేష్ కుమార్ పారిపోయాడు.
ఈ ఘ‌ట‌న జ‌రిగిన మూడు రోజుల త‌ర్వాత రాహుల్, సోనూను మృత‌దేహాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం మంత్ర‌గాడిని అరెస్టు చేసి విచారించ‌గా, ఈ విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.

Updated On 23 Nov 2022 9:14 AM GMT
subbareddy

subbareddy

Next Story