తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో అంబరాన్నంటిన సంబురాలు విధాత: తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో తీన్మార్ సంక్రాంతి సాంస్కృతిక ఉత్సవాలు డాంటే అలిగేరి అకాడమీ, కిప్లింగ్‌లో ఘనంగా జరిగాయి. TCA స్పాన్సర్స్ శ్రీమతి దివ్య దొంతి, శ్రీమతి కస్తూరి ఛటర్జీ, శ్రీమతి మనస్విని వెలపాటి, శ్రీమతి శ్వేతా పుల్లూరి, శ్రీమతి శ్రేయ ఆకుల జ్యోతి ప్రజ్వలన చేసి సంబురాలు ప్రారంభించిన ఈ సంబురాల్లో 1500 మందికి పైగా తెలంగాణ వాసులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా […]

తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో అంబరాన్నంటిన సంబురాలు

విధాత: తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో తీన్మార్ సంక్రాంతి సాంస్కృతిక ఉత్సవాలు డాంటే అలిగేరి అకాడమీ, కిప్లింగ్‌లో ఘనంగా జరిగాయి. TCA స్పాన్సర్స్ శ్రీమతి దివ్య దొంతి, శ్రీమతి కస్తూరి ఛటర్జీ, శ్రీమతి మనస్విని వెలపాటి, శ్రీమతి శ్వేతా పుల్లూరి, శ్రీమతి శ్రేయ ఆకుల జ్యోతి ప్రజ్వలన చేసి సంబురాలు ప్రారంభించిన ఈ సంబురాల్లో 1500 మందికి పైగా తెలంగాణ వాసులు పాల్గొన్నారు.

ఈ వేడుకల్లో భాగంగా భోగి పళ్ళు పిల్లల సాంప్రదాయ వేడుకలు, విచిత్ర వేషాధారణ, డ్రాయింగ్, పతంగుల తయారీ, క్విజ్ మరియు ముగ్గుల పోటీలు నిర్వహించగా అనూహ్యమైన స్పందన లభించింది. సంక్రాంతి ప్రత్యేకంగా చేసిన స్కిట్, పలు నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. పోటీల్లో విజయం సాధించిన వారందరికీ చివరిలో బహుమతులు అందజేశారు.

మహిళా కమిటీ సభ్యులు శ్రీమతి రాధికా బెజ్జంకి, శ్రీమతి ప్రసన్న మేకల మరియు శ్రీమతి మాధురి చట రాజు ఈ కార్యక్రమాన్ని మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ కెనడా అసోసియేషన్ 2023 టొర్ంటో తెలుగు క్యాలెండర్‌ను ఆవిష్కరించి కమిటీ సభ్యులకు అందజేశారు.

అనంతరం తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం మాట్లాడుతూ తెలంగాణ పండుగలని మరియు సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేసి ముందుకు తీసుకు వెళ్లడానికి దోహదం చేస్తాయని అన్నారు.

ఈ సంబురాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఆధ్వర్యంలో బోర్డు అఫ్ ట్రస్టీ మరియు వ్యవస్థాపక సభ్యుల సహకారంతో విజయవంతం చేశారు. ఉత్సవాలలో సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి దీపా గజవాడ సహకారంతో కుమారి ప్రహళిక మ్యాకల, రాహుల్ బాలనేని ఐదు గంటల పాటు యాంకరింగ్ చేసి ప్రేక్షకులను అలరించారు.

కార్యక్రమం చివరిలో మహిళలకు పసుపు, కుంకుమ, తెలంగాణ ఫలహారాలతో కూడిన వాయనాలను అందజేసి తెలంగాణ కెనడా అసోసియేషన్ తన ప్రత్యేకతను చాటుకుంది. ఉపాధ్యక్షుడు మనోజ్ రెడ్డి కృతజ్ఞతా వందన సమర్పణతో వేడుకలు ముగిశాయి.

ఈ వేడుకల్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం, ఉపాధ్యక్షుడు మనోజ్ రెడ్డి కార్యదర్శి శంతన్ నారెళ్ళపల్లి, సంయుక్త కార్యదర్శి రాజేష్ అర్ర, సాంస్కృతిక కార్యదర్శి దీపా గజవాడ, సంయుక్త సాంస్కృతిక కార్యదర్శి ప్రహళిక మ్యాకల, కోశాధికారి వేణుగోపాల్ ఐల, సంయుక్త కోశాధికారి రాహుల్ బాలనేని మరియు డైరెక్టర్లు నాగేశ్వరరావు దలువాయి, ప్రవీణ్ కుమార్ శ్యామల, ప్రణీత్ పాలడుగు, శంకర్ భరద్వాజ పోపూరి, యూత్ డైరెక్టర్ ధాత్రి అంబటి, బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ చైర్మన్ నవీన్ ఆకుల బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ సభ్యులు మురళి సిరినేని, ప్రసన్న మేకల, మురళీధర్ కందివనం, మాధురి చాతరాజు మరియు వ్యవస్థాపక కమిటీ చైర్మన్ అతిక్ పాషా వ్యవస్థాపక సభ్యులు దేవేందర్ రెడ్డి గుజ్జుల, కోటేశ్వర రావు చిత్తలూరి, కలీముద్దీన్ మొహమ్మద్, ప్రకాష్ చిట్యాల, అఖిలేష్ బెజ్జంకి, ప్రభాకర్ కంబాలపల్లి, శ్రీనివాస తిరునగరి, హరిరాహుల్, సంతోష్ గజవాడ, విజయ్ కుమార్ తిరుమలపురం శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

Updated On 17 Jan 2023 2:10 PM GMT
krs

krs

Next Story