Tuesday, January 31, 2023
More
  HomelatestViral Video | ప్ర‌యాణికుడిని బూటు కాళ్ల‌తో త‌న్నిన టికెట్ క‌లెక్ట‌ర్లు

  Viral Video | ప్ర‌యాణికుడిని బూటు కాళ్ల‌తో త‌న్నిన టికెట్ క‌లెక్ట‌ర్లు

  Viral Video | ఓ ఇద్ద‌రు రైలు టికెట్ క‌లెక్ట‌ర్లు త‌మ బాధ్య‌త‌ను మ‌రిచి ప్ర‌వ‌ర్తించారు. ఓ ప్ర‌యాణికుడి ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. ప్ర‌యాణికుడిని కింద‌ప‌డేసి చిత‌క‌బాదారు. బూట్ల కాళ్ల‌తో త‌న్నారు. ఈ ఘ‌ట‌న బీహార్‌లోని ముజ‌ఫ‌ర్‌పూర్ ఏరియాలో వెలుగు చూసింది.

  వివ‌రాల్లోకి వెళ్తే.. జ‌న‌వ‌రి 2వ తేదీన రాత్రి ముంబై నుంచి జైన్‌న‌గ‌ర్‌కు రైలు బ‌య‌ల్దేరింది. ధోలి రైల్వే స్టేష‌న్ స‌మీపంలో టికెట్ క‌లెక్ట‌ర్లు ప్ర‌యాణికుల టికెట్ల‌ను త‌నిఖీ చేస్తున్నారు. అయితే ఓ ప్ర‌యాణికుడు టికెట్ లేకుండా ప్ర‌యాణిస్తున్నాడు. పై బెర్త్‌లో ప‌డుకుని ఉన్నాడు. దీంతో టికెట్ క‌లెక్ట‌ర్‌కు కోపం వ‌చ్చింది. కింద‌కు దిగాల‌ని ఆదేశించారు.

  టీసీ మాట‌లు వినిపించుకోవ‌డంతో అత‌ని కాళ్లు ప‌ట్టుకుని లాగాడు. ఈ క్ర‌మంలో టీసీ ముఖంపై ప్ర‌యాణికుడు త‌న్న‌డంతో.. అక్క‌డే ఉన్న మ‌రో టీసీ అప్ర‌మ‌త్త‌మ‌య్యాడు. ఇద్ద‌రూ క‌లిసి ప్ర‌యాణికుడిని కింద‌కు లాగేశారు. ఆ త‌ర్వాత ముఖంపై బూట్ల కాళ్ల‌తో త‌న్నారు. మిగ‌తా ప్ర‌యాణికులు టీసీల‌ను ఆపేందుకు య‌త్నించారు.

  ఈ త‌తంగాన్ని అక్క‌డున్న ఓ ప్ర‌యాణికుడు త‌న ఫోన్‌లో చిత్రీక‌రించి వైర‌ల్ చేశాడు. ఈ వీడియో రైల్వే ఉన్న‌తాధికారుల దాకా చేరింది. టికెట్ క‌లెక్ట‌ర్ల‌ను ఇద్ద‌రిని స‌స్పెండ్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. విచార‌ణ అనంత‌రం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular