Tuesday, January 31, 2023
More
    Homelatestకాంగ్రెస్ పొత్తుతో న‌ష్ట‌పోయిన టీడీపీ: అయిలయ్య యాదవ్

    కాంగ్రెస్ పొత్తుతో న‌ష్ట‌పోయిన టీడీపీ: అయిలయ్య యాదవ్

    విధాత: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడంతో తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నష్టపోయిందని TDP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి అయిలయ్య యాదవ్ అన్నారు. మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో TDP కార్యాలయాన్ని అయిలయ్య యాదవ్ ప్రారంభించారు.

    అంతకముందు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో అయిలయ్య యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 119 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని 13 స్థానాల్లో మాత్రమే టిడిపి పోటీ చేయడం వల్ల రాష్ట్రంలోని కార్యకర్తలు నిరాశకు లోనయ్యారని పేర్కొన్నారు.

    పేద వర్గాల వేదికైనా తెలుగుదేశం పార్టీ కొంత బలహీన పడ్డట్టు కనిపించడంతో బలహీన వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారని తెలిపారు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని అందుకే ప్రజలు మళ్లీ తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని చెప్పారు.

    రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం, పార్టీల పట్ల ప్రజలు విశ్వాసం కోల్పోయారని మళ్లీ తెలుగుదేశం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అందుకు ఖమ్మంలో విజయవంతమైన భారీ బహిరంగ సభ నిదర్శనం అన్నారు. తెలుగుదేశం హయాంలో ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు మర్చిపోలేదని పేర్కొన్నారు.

    పార్టీకి పూర్వ వైభవం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని అన్ని మండలాల్లో ఘనంగా నిర్వహించాలని కోరారు. సభ్యత్వ నమోదు, పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి చేసుకొని ఇంటింటా తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.

    సమావేశంలో టిడిపి పార్లమెంట్ అధికార ప్రతినిధి మక్కెన అప్పారావు, నారాయణపురం, చండూరు నాంపల్లి మండల పార్టీ అధ్యక్షులు ఏర్పుల సుదర్శన్ ఎర్రజల్ల లింగయ్య, మొగుదాల పార్వతమ్మ, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి పగడాల లింగయ్య, షరీఫ్, నాయకులు ఆరోగ్యం, పెట్టు గల అంజయ్య, అంతోని, పొడపంగి సైదులు, పాషా, పందుల రాములు, బొడ్డుపల్లి సత్తయ్య శ్రీశైలం, ఊశయ్య, బొడ్డు రాములు మోగుదల యాదయ్య, నరసింహయ్య, భయ్యా కృష్ణయ్య, అవ్వారి సుబ్బారావు, గంట అంజయ్య, సాంబయ్య, ఏర్పుల సురేష్, మంగి మహేష్, వలిగొండ మాధవ్ తదితరులు పాల్గొన్నారు

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular