ప్రకటనలు బారెడు.. పనితీరు చారెడు టీడీపీలో మాటలు ఎక్కువ.. పని తక్కువ ఉన్నమాట: అక్క ఆరాటమే తప్ప బావ బతకడు అన్నట్లుగా ఉంది టీడీపీ పరిస్థితి. ఎంపీ రఘురామ కృష్ణం రాజు.. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు వంటి నాయకులు.. ఇంకా కొన్ని టీవీ న్యూస్ చానెళ్లు జాకీలతో ఎత్తడం తప్ప గ్రామ స్థాయిలో టీడీపీ బలపడే పరిస్థితి కానరావడం లేదు. టీవీ చానెళ్లు ఎంత ఎగిరెగిరి దంచుతున్నా ఊక మాత్రమే వస్తోంది తప్ప ఓట్లు రాలే […]

  • ప్రకటనలు బారెడు.. పనితీరు చారెడు
  • టీడీపీలో మాటలు ఎక్కువ.. పని తక్కువ

ఉన్నమాట: అక్క ఆరాటమే తప్ప బావ బతకడు అన్నట్లుగా ఉంది టీడీపీ పరిస్థితి. ఎంపీ రఘురామ కృష్ణం రాజు.. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు వంటి నాయకులు.. ఇంకా కొన్ని టీవీ న్యూస్ చానెళ్లు జాకీలతో ఎత్తడం తప్ప గ్రామ స్థాయిలో టీడీపీ బలపడే పరిస్థితి కానరావడం లేదు. టీవీ చానెళ్లు ఎంత ఎగిరెగిరి దంచుతున్నా ఊక మాత్రమే వస్తోంది తప్ప ఓట్లు రాలే పరిస్థితి కనబడడం లేదు.

2019 ఎన్నికల్లో ఓడిపోయాక ఇన్నాళ్లు ఎక్కడున్నారో గానీ గుంటూరుకు చెందిన రాయపాటి సాంబశివ రావు.. టీడీపీకి బూస్ట్ ఇచ్చే ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తుడిచి పెట్టుకుపోతుందని 2024 ఎన్నికల్లో టీడీపీదే ఘన విజయమని పేర్కొన్నారు. అంతేకాదు రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 125 అసెంబ్లీ స్థానాల్లో తెలుగు దేశం పార్టీ విజయం సాధిస్తుందని అన్నారు.

విజన్ ఉన్న నేతగా.. నారా చంద్రబాబు పేరు తెచ్చుకున్నారని.. ఆయన వైపే ప్రజలు చూస్తున్నారని చెప్పారు. మరి ఆయన ఇంత గొప్పగా ప్రకటించిన తర్వాత కూడా టీడీపీలో ఎక్కడా జోష్ కనిపించక పోవడం గమనార్హం. ఒక్క నాయకుడు కూడా స్పందించలేదు. టీవీ ఛానళ్లలోనూ దీనిమీద ఎక్కడా చర్చలు జరపలేదు.

అంటే టీడీపీ నేతలు రాయపాటి చెప్పింది నిజం కాదని అనుకున్నారా? అనిపిస్తోంది. ఎప్పుడూ మాకు అన్ని సీట్లు వస్తాయని ఇన్ని సీట్లు వస్తాయని ప్రజలకు చెప్పుకొనే బోండా ఉమా, దేవినేని ఉమా, పయ్యావుల కేశవ్, అయ్యన్నపాత్రుడు వంటి నాయకులు కూడా రాయపాటి మాటలను సపోర్ట్ చేయడమో, మాకు ఇన్ని సీట్లు వస్తున్నాయని రాయపాటి చెప్పాడని సంతోషం కూడా వ్యక్తం చేయడం లేదంటే ఆయన మాటలను లైట్ తీసుకున్నట్లే కనిపిస్తోంది. గ్రామ, మండల స్థాయిలో కూడా క్యాడర్ ఇంకా యాక్టివ్ కాక పోవడం చూస్తుంటే వాళ్లకు కూడా పార్టీ సత్తా మీద అనుమానాలు ఉన్నట్లే అనిపిస్తోంది

Updated On 3 Oct 2022 2:51 PM GMT
krs

krs

Next Story