- బాలయ్యకు వ్యతిరేకంగా అక్కినేని అభిమానుల ఆందోళన
- క్షమాపణ చెప్పాలని కాపునాడు డిమాండ్
విధాతై పబ్లిక్ ఫిగర్స్ నోటిని అదుపులో ఉంచుకోవాలి .. మాట మీద నియంత్రణ కోల్పోతే అది ఎక్కడికి దారి తీస్తుందో.. ఎన్ని చిక్కులు వస్తాయో.. ఎంతమందికి ఎన్నివిధాలా సమాధానం చెప్పుకోవాలో తెలియని పరిస్థితి వస్తుంది. బాలకృష్ణకు సరిగ్గా ఇదే పరిస్థితి ఎదురైంది.
ఆయన ఎప్పుడూ నోటిని కంట్రోల్లో ఉంచుకోలేరు.. ఏదీ వస్తే అది మాట్లాడేస్తుంటారు. ఆ మాట ఎవరికి తగులుతుంది.. దాని పర్యవసానాలు ఏమిటన్నది చూసుకోరు.. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న తరువాత ఆ మాత్రం సోయి లేకుండా మాట్లాడితే ఏమవుతుందో అన్నది ఆయన అవగతం చేసుకోవాలి.
అందరిచేతా మంచివాడు అనిపించుకోవాలి తప్ప వయసు పెరిగినా బుద్ధి పెరగలేదని పదిమందితో చెప్పించుకునే పరిస్థితి వస్తే ఇలాగే ఉంటుంది. తాజాగా వీర సింహారెడ్డి విజయోత్సవ వేడుకల్లో బాలయ్య మాటలు తూలారు. ఆ రంగారావు ఈ రంగారావు అక్కినేని తొక్కినేని అంటూ ఆయన ప్రాస కోసం అన్నారో లేక చిన్న చూపుతో అన్నారో గానీ ఏదో అనేశారు. అది ఇప్పుడు అగ్గి మంటలా మారింది.
బాలయ్య ఆ రంగారావు ఈ రంగారావు అని మహా నటుడు ఎస్వీయార్ మీద నోరు జారారని కాపు నాడు నుంచి బాలయ్యకు అల్టిమేటం జారీ అయింది. బాలయ్య క్షమాపణ చెప్పాలని కాపునాడు డిమాండ్ చేస్తోంది. ఇక అక్కినేని తొక్కినేని అన్నందుకు నాగచైతన్య కూడా కాస్త బుద్ధి చెప్పేలా కామెంట్ పెట్టారు.
రామారావు.. నాగేశ్వర రావు వీళ్ళు కళామతల్లి ముద్దు బిడ్డలు.. వీళ్లను సమున్నతంగా గౌరవించుకుందాం అంటూ ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ.. వాళ్ళను మనమే కించపరిస్తే ఎలా అని చైతూ ప్రశ్నించాడు. ఇక అనంత పురంలో అయితే అక్కినేని అభిమానులు బాలయ్యకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఆయన ఫ్లెక్సీలు దహనం చేశారు.
ఏపీలో వైసీపీ పాలనని అంతమొందించాలని అంతా కలసికట్టుగా ఒక్కటి కావాలని అనుకుంటున్న వేళ.. పాలలో విషం పోసినట్లుగా బాలయ్య డైలాగులు ఒక విశ్వ నటుడిని అవమానించడమే కాదు ఒక కులాన్ని కూడా అవమానించారని కూడా కాపులు మండి పడుతున్నారు. బాలయ్య వాచాలత్వంతో ఇప్పుడు టీడీపీ ఇరుకున పడినట్లు అయింది.