TDP బీజేపీ మీద ఆగ్రహంతో చంద్రబాబు ? విధాత‌: కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం ఇప్పుడు అదే కాంగ్రెస్ తో చేతులుకలుపుతోందా ? భారత్ దేశంలో కేంద్ర స్థాయిలో బీజేపీని వెతిరేకిస్తూ ఈమధ్యనే పురుడుపోసుకున్న ద్వితీయకూటమి ఇండియా.. కాంగ్రెస్ సారధ్యంలోని ఈ కూటమిలో బీజేపీని వ్యతిరేకించే పార్టీలు చాలా చేరాయి. అయితే ఇప్పుడు ఆ కూటమిలో చంద్రబాబు చేరుతున్నారా ? అనే అనుమానాలు వస్తున్నాయి. ఎన్టీయార్ ఉండగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన ఈ పార్టీ […]

TDP

  • బీజేపీ మీద ఆగ్రహంతో చంద్రబాబు ?

విధాత‌: కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం ఇప్పుడు అదే కాంగ్రెస్ తో చేతులుకలుపుతోందా ? భారత్ దేశంలో కేంద్ర స్థాయిలో బీజేపీని వెతిరేకిస్తూ ఈమధ్యనే పురుడుపోసుకున్న ద్వితీయకూటమి ఇండియా.. కాంగ్రెస్ సారధ్యంలోని ఈ కూటమిలో బీజేపీని వ్యతిరేకించే పార్టీలు చాలా చేరాయి. అయితే ఇప్పుడు ఆ కూటమిలో చంద్రబాబు చేరుతున్నారా ? అనే అనుమానాలు వస్తున్నాయి.

ఎన్టీయార్ ఉండగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన ఈ పార్టీ అయన ఉన్నంత వరకూ తెలుగువారి ఆత్మగౌరవం అంటూ కాంగ్రెస్ కు వ్యతిరేకంగానే పోరాడింది. కాంగ్రెస్ కు చెందిన కోట్ల విజయభాస్కర్ రెడ్డిని రెండుసార్లు ఓడించి తెలుగుదేశాని రామారావు అధికారంలోకి తెచ్చారు. అయితే అదే కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుని తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేసారు. ప్రయోగాత్మకంగా అయన అక్కడ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు.. అక్కడ గెలిస్తే ఆంధ్రాలో కూడా అదే వ్యూహం అమలు చేద్దాం అనుకుంటే తెలంగాణాలో కాంగ్రెస్. టిడిపి కూటమికి దెబ్బ తగిలి కేసీఆర్ గెలిచారు. దీంతో ఆంధ్రాలో ఆ వ్యూహం కుదరదు అనుకుని ఊరుకున్నారు.

ఇదిలా ఉండగా ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. తన అరెస్టుకు బీజేపీ మద్దతు ఉందని, వారిచ్చిన సపోర్ట్ తోనే జగన్ తనను అరెస్ట్ చేసినట్లు రగిలిపోతున్న చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్ కూటమితో పోవాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. తాను మోడీని, అమిత్ షా ను కలిసి, ప్రసన్నం చేసుకునేందుకు ఎంత ప్రయత్నించినా వాళ్ళు అవకాశం ఇవ్వకపోవడం, లోకేష్ తో కలిసి బీజేపీ మద్దతు పొందుదాం అని ఎంతగా ట్రై చేసినా బీజేపీ పెద్దలు ఖాతరు చేయకపోవడంతో చంద్రబాబు అవమాన పడ్డారు.

దీంతో బీజేపీ మీద రగిలిపోతున్నారు. తాను ఎంతగా ప్రాధేయపడినా లెక్కచేయని, తన మీద కోపంగా ఉన్న బీజేపీతో పనిలేదని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి గెలుస్తుందని అంచనా వేసిన చంద్రబాబు ఈసారి కాంగ్రెస్ కూటమితో వెళితే బావుంటుందని ఫిక్స్ అయ్యారట. దీంతో ఆమేరకు .. ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బెయిల్ సంగతి అప్పుడే తెలిసేలా లేదు.. 19న మళ్ళా బెయిల్ మీద కోర్టులో వాదనలు జరగనున్నాయి.

Updated On 16 Sep 2023 12:35 PM GMT
somu

somu

Next Story