TDP Website విధాత‌: చంద్రబాబు నాయుడిని అక్రమంగా, కుట్రపూరితంగా అరెస్ట్ చేసారు.. ఇదంతా జగన్ రాజకీయ కక్షతోనే చేశారు. చంద్రబాబు అమాయకుడు అని చెబుతూ వస్తున్న తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ సైతం మద్దతుగా నిలిచారు. అయన సైతం చంద్రబాబు అమాయకుడు అని చెబుతూ ఆయనతో పొత్తుకు సైతం ఒకే చెప్పారు. ఐతే తాము స్కిల్ డెవలప్మెంట్ మీద లక్షల మందికి శిక్షణ ఇచ్చామని, వేల మందికి ఉద్యోగాలు ఇప్పించామని తెలుగుదేశం చెబుతోంది. ఆ ప్రక్రియలో ఎక్కడా నిధులు […]

TDP Website

విధాత‌: చంద్రబాబు నాయుడిని అక్రమంగా, కుట్రపూరితంగా అరెస్ట్ చేసారు.. ఇదంతా జగన్ రాజకీయ కక్షతోనే చేశారు. చంద్రబాబు అమాయకుడు అని చెబుతూ వస్తున్న తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ సైతం మద్దతుగా నిలిచారు. అయన సైతం చంద్రబాబు అమాయకుడు అని చెబుతూ ఆయనతో పొత్తుకు సైతం ఒకే చెప్పారు. ఐతే తాము స్కిల్ డెవలప్మెంట్ మీద లక్షల మందికి శిక్షణ ఇచ్చామని, వేల మందికి ఉద్యోగాలు ఇప్పించామని తెలుగుదేశం చెబుతోంది.

ఆ ప్రక్రియలో ఎక్కడా నిధులు దుర్వినియోగం జరగలేదని గట్టిగా వాదిస్తోంది. మరోవైపు టీడీపీ సోషల్ మీడియా, ఐటీ విభాగం కూడా చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్నాయి. దీంతో బాటు ఎక్కడికక్కడ టీడీపీ శ్రేణులు ధర్నాలు చేసి జగన్ మీద ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఇదిలా ఉండగా ప్రభుత్వం వైపు నుంచి సీఐడీ అధికారులతో బాటు అదనపు అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వంటి వాళ్ళు టీవీ ఛానళ్లలో డిబేట్స్ సైతం చేస్తూ చంద్రబాబు ఏ విధంగా అవినీతికి పాల్పడిందీ వివరిస్తున్నారు.

అటు టీడీపీ వాళ్ళు, వారి అనుకూల మీడియా కూడా చంద్రబాబు ప్రమేయం లేదని వాదిస్తున్నారు. ఈ క్రమంలో తమ వాదనకు మరింత బలం చేకూరేలా.. ఆ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ ఎంత సమర్థంగా నిర్వహించినదీ వివరించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేసారు. అసలా పథకం ఎంత సమర్థంగా నిర్వహించినది.. ఎక్కడెక్కడ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసింది.

నిధులు రాక. పోక.. ఉద్యోగాల కల్పన.. జాబ్ మేళాల నిర్వహణ.. ఇలా ప్రతి సమాచారం అందించేందుకు ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేశారు. ప్రజల సవాలక్ష సందేహాలకు అందులో సమాధానాలు దొరుకుతాయని, ఎక్కడా అవినీతి జరగలేదని అంతా పారదర్శకంగా చేశామని ఆ వెబ్ సైట్ ద్వారా చెప్పాలని టీడీపీ నిర్ణయించుకుంది. దీంతో ఇప్పటికే ఆ వెబ్ సైట్ సిద్ధం చేశారు.

అందులో ఆ పథకానికి సంబంధించి ప్రొసీడింగ్స్.. ఇతర సమస్త వివరాలు ఉంచారు. సీఐడీ చెబుతున్నవన్నీ అబద్ధాలని, తాము ఎక్కడా పైసా నిధులు దుర్వినియోగం చేయలేదని ఆ వెబ్ సైట్ ద్వారా చెప్పడానికి టిడిపి గట్టి ప్రయత్నం చేస్తోంది. ఒక కేసు మీద.. ఒక కుంభకోణం మీద వివరణ ఇస్తూ ఇలా వెబ్ సైట్ ఏర్పాటు చేయడం రాజకీయాల్లో సరికొత్త ఆలోచన. ఇదిగో.. అదే ఈ వెబ్ సైట్.

Updated On 15 Sep 2023 12:33 PM GMT
somu

somu

Next Story